Breaking News

Devatha: కనకం మాస్టర్‌ ప్లాన్‌.. అడ్డంగా దొరికిపోయిన సత్య-నందా

Published on Thu, 05/13/2021 - 15:24

నందా ప్రవర్తనపై కనకం,రుక్మిణి సహా ఈశ్వర్‌ ప్రసాద్‌కు కూడా అనుమానం కలుగుతుంది. రాజేశ్వరితో నందా ఫోన్‌ మాట్లాడటం రుక్మిణి స్వయంగా వింటుంది. సత్య-నందాలు నిజంగానే ప్రేమికులా అన్న విషయం తెలుసుకోవడానికి కనకం ఓ మాస్టర్‌ ప్లాన్‌ను రచిస్తుంది. ఇందులో సత్య-నందాలు బొక్కబోర్లాపడతారు... ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలతో దేవత సీరియల్‌ 232వ ఎపిసోడ్‌లోకి ఎంటర్‌ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

సత్య-నందాల పెళ్లి విషయంపై ఆదిత్య సీరియస్‌ అవుతాడు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా పెళ్లి ముహూర్తం ఎలా పెట్టారంటూ ఫైర్‌ అవుతాడు. దీనికి పెళ్లి నాది కదా నువ్వు ఎందుకు టెన్షన్‌ పడుతున్నావ్‌ అని నందాను ఆదిత్య అడగ్గా, ఈశ్వర్‌ ప్రసాద్‌ కల్పించుకొని ఆదిత్యకు బాధ్యత ఉంటుంది కదా అని నందాకు సర్దిచెప్తాడు. ఇక నందా వాలకంపై కనకంతో పాటు రుక్మిణి సైతం అనుమానం వ్యక్తం చేస్తుంది. కనకంతో కలిసి నందా ఎలాంటి వాడన్నది ఆదిత్యను అడుగుతుంది. అయితే సూటిగా చెప్పకుండా నందా కొంచెం వేరేలా ఉంటాడు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు అంటూ అతడిపై అనుమానం వచ్చేలా మాట్లాడుతాడు.

ఇక దేవుడమ్మ భర్త ఈశ్వర్‌ ప్రసాద్‌కు కూడా నందా ప్రవర్తనపై అనుమానం కలుగుతుంది. ఈ విషయం వెంటనే దేవుడమ్మతో చెప్పాలనుకుంటాడు. కానీ వేరే ఊరు వెళ్లిన ఆమెకి ఇప్పుడు ఈ విషయాలు చెప్పి ఎందుకు బాధపెట్టడం అని ఫోన్‌ కట్‌ చేస్తాడు. సీన్‌ కట్‌ చేస్తే నందా రాజేశ్వరితో మాట్లాడటం రుక్మిణి స్వయంగా వింటుంది. అయితే ఆ రాజేశ్వరి దేవుడమ్మ శత్రువేనా, కాదా అన్నది ఎలా తెలుసుకోవాలని అని కనకంను అడుగుతుంది. దీంతో నందా చూపు, మాటతీరు అంతా తేడాగా ఉందని, అసలు అతను చెప్పేవన్నీ అబద్దాలేమో అని కనకం అనుమానం వ్యక్తం చేస్తుంది.

దీంతో ఎలా అయినా నందా బండారం బయట పెట్టాలని  రుక్మిణి- కనకం నిర్ణయించుకుంటారు. ఇందుకోసం కనకం ఓ మాస్టర్‌ ప్లాన్‌ను రచించింది. దీని ప్రకారం కనకం సత్యతో, రుక్మిణి నందా దగ్గరికి వెళ్లి మీరు ఎక్కడ కలిశారు? మొదట ఎవరు ప్రపోజ్‌ చేశారు? ఏ గిఫ్ట్‌ ఇచ్చిపుచ్చుకున్నారు వంటి ప్రశ్నలను అడగుతారు. ఇక్కడే సత్య-నందాలు దొరికిపోయారు. ఇద్దరూ వేరు వేరు సమాధానాలు చెప్తారు. దీంతో రుక్మిని-కనకంల అనుమానం మరింత బలపడుతుంది. మరి వీళ్ల తర్వాతి ప్లాన్‌ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)