Breaking News

Devatha : సత్య బిడ్డకు తండ్రిని తానే అని ఒప్పుకున్న ఆదిత్య

Published on Sat, 06/12/2021 - 15:01

కనకం అన్న మాటలు తలుచుకొని సత్య కుంగిపోతుంది. మరోవైపు తనకు ఆరోగ్యం బాలేదని చెప్పి రుక్మిణి ఆదిత్యను బయటకు తీసుకెళ్తుంది. మార్గమధ్యలో మనం వెళ్లేది హాస్పిటల్‌కు కాదని, కారును మామిడితోట వద్ద ఆపమని చెప్తుంది. అక్కడే సత్య-ఆదిత్యల గురించి నిజాన్ని తెలుసుకుంటుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం తానే అంటూ ఆదిత్య ఒప్పుకుంటాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ జూన్‌ 12న 258వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

కనకం అన్న మాటలకు సత్య బాధపడుతుంది. తనకు వేరే వాళ్లతో పెళ్లి ఎలా చేస్తారంటూ రాజ్యాన్ని నిలదీస్తుంది. అయితే ఇది అందరి నిర్ణయం కాదని, కనకం మాటలను పట్టించుకోవద్దని రాజ్యం బదలిస్తుంది. ఇక సత్యను అంటే ఆదిత్యకు అంత కోపం ఎందుకు వస్తుందంటూ కనకం రుక్మిణిని అడుగుగుతుంది. ఏదో తన బిడ్డే అన్నట్లు ఆదిత్య మాట్లాడటం చూస్తుంటే తనకేదో అనుమానం కలుగుతుందని రుక్మిణిని చెబుతుంది. ముందే జాగ్రత్తగా ఉండమని, లేదంటే నీ జీవితం కూడా నాశనం అవుతుందని రుక్మిణి మనసులో మరింత అనుమానం రేపుతుంది. సీన్‌ కట్‌ చేస్తే తన ఆరోగ్యం బాలేదని, తనను హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని రుక్మిణి ఆదిత్యను కోరుతుంది.

ఇద్దరూ కలిసి వెళ్తుండగా రుక్మిణి కారును తన తోట వైపు తీసుకెళ్లమని చెప్తుంది. అయితే హాస్పిటల్‌కి కదా వెళ్లాల్సింది అని ఆదిత్య ప్రశ్నించగా..తను బాగానే ఉన్నానని, ఒక విషయం మాట్లాడటానికే తోటకు తీసుకొచ్చానని రుక్మిణి బదులివ్వడంతో ఆదిత్య షాకవుతాడు. రుక్మిణి ఏం మాట్లాడుతుందో అని టెన్షన్‌ పడతాడు. దీంతో దేవుడమ్మ మీద ప్రమాణం చేసి తను అడిగే ఒక ప్రశ్నకు నిజం చెప్పాలంటూ రుక్మిణి మాట తీసుకుంటుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనా పెనిమిటి అని రుక్మిణి ప్రశ్నిస్తుంది. దీంతో ఆదిత్య నిజాన్ని ఒప్పుకుంటాడు. సత్య  కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనే అని నిజం చెప్పేయడంతో రుక్మిణి షాకవతుంది. తర్వాత రుక్మిణి ఏం చేస్తుంది? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి వంటి వివరాలను తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)