Breaking News

జపాన్‌లో దేవర

Published on Mon, 03/24/2025 - 00:27

జపాన్‌ వెళ్లారు ఎన్టీఆర్‌. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవర’. కల్యాణ్‌ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాలోని తొలి భాగం ‘దేవర: పార్ట్‌ 1’ 2024 సెప్టెంబరు 27న విడుదలైంది. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా (తండ్రి పాత్ర దేవర, కొడుకు పాత్ర వర) నటించి, ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్‌. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ. 500 కోట్లు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా మేకర్స్‌ పేర్కొన్నారు.

ఇక ఈ నెల 28న ‘దేవర: పార్ట్‌ 1’ సినిమా జపాన్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ప్రమోషనల్‌ టూర్‌లో భాగంగా ఎన్టీఆర్‌ జపాన్‌ వెళ్లారు. ఈ ప్రమోషనల్‌ టూర్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తాను హీరోగా చేస్తున్న ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమా షూట్‌లో ఎన్టీఆర్‌ పాల్గొంటారని సమాచారం.

అలాగే ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న ‘వార్‌ 2’ సినిమా ఆగస్టు 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ పూర్తయ్యాక ‘దేవర 2’ సినిమా షూట్‌లో పాల్గొంటారని, ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నారని సమాచారం.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)