Breaking News

మూడు నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఎన్టీఆర్‌.. కారణం ఇదే!

Published on Sun, 09/22/2024 - 11:53

‘దేవర’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్టీఆర్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్‌ ఫ్రీ అవుతారు. సో... ఇక తదుపరి చిత్రం షూటింగ్‌తో బిజీ అవుతారనుకోవచ్చు. అయితే ఓ మూడు నెలల తర్వాతే నెక్ట్స్‌ మూవీ షూట్‌లో పాల్గొంటారట ఎన్టీఆర్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెల 21న ఆరంభమవుతుంది. 

(చదవండి: శ్రీలంకవైపు ఇండియన్‌ సినిమా చూపు)

అయితే అప్పుడు ఎన్టీఆర్‌ పాల్గొనరట. ఈ హీరో లేని సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెడతారు. 21 నుంచి దాదాపు 40 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ పాల్గొనరు. జనవరిలోనే ఈ చిత్రం సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు ఎన్టీఆర్‌. ఈ మూడు నెలల సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తారట. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. 

టైటిల్‌ ఇదేనా?
సలార్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ ఫుల్‌ ఫోకస్‌ ఎన్టీఆర్‌ సినిమాపైనే పెట్టేశాడు. కేజీయఫ్‌, సలార్‌ మాదిరే ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి పండగే. ఎందుకంటే ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన కేజీయఫ్‌ రెండు భాగాలుగా వచ్చి సూపర్‌ హిట్‌గా నిలిచాయి. అలాగే సలార్‌ పార్ట్‌ 2 కూడా రాబోతుంది. ఈ రెండు చిత్రాల మాదిరే ఎన్టీఆర్‌ మూవీ కూడా కచ్చితంగా భారీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని ఫ్యాన్స్‌ చెబుతున్నారు. మైత్రీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)