Breaking News

ఐస్‌క్రీమ్‌ తిన్నందుకే నా భార్య చనిపోయింది: ప్రముఖ విలన్‌

Published on Thu, 09/11/2025 - 13:44

మలయాళ నటుడు దేవన్‌ (Devan Sreenivasan ) భార్యను కోల్పోయి ఆరేళ్లపైనే అవుతోంది. దేవా సతీమణి సుమ 2019లో అలర్జీతో మరణించింది. తాజాగా భార్యను గుర్తు చేసుకున్న నటుడు ఆమె మరణానికి గల కారణాన్ని వెల్లడించాడు. దేవన్‌ మాట్లాడుతూ.. తను బాగానే ఉండేది. ఏమైందో ఏమో కానీ ఐస్‌క్రీమ్‌ తింటే మాత్రం పడేది కాదు. అదెలా తెలిసిందంటే.. చెన్నైలో ఉన్నప్పుడు ఓసారి ఐస్‌క్రీమ్‌ తిన్నాం. కాసేపటికే తనకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. 

డాక్టర్‌ వార్నింగ్‌
వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తను ఎప్పటికీ ఐస్‌క్రీమ్‌ తినకూడదని డాక్టర్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. మేము కూడా దాన్ని ఫాలో అయ్యాం. ఒకరోజు నా కూతురు లక్ష్మి దాని బిడ్డను తీసుకుని మా ఇంటికి వచ్చింది. అప్పుడు నేను ఇంట్లో లేను. షూటింగ్‌ కోసం వేరే లొకేషన్‌లో ఉన్నాను. పిల్లల కోసమని ఐస్‌క్రీమ్‌ కొన్న ఆమె కాస్త మిగిలితే దాన్నలాగే వదిలేసి తిరిగెళ్లిపోయింది. ఇంట్లో ఉన్న సుమ.. డాక్టర్‌ వార్నింగ్‌ మర్చిపోయి కాస్తం ఐస్‌ క్రీమ్‌ తింది. అంతే.. మళ్లీ తనకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది.

వెళ్లేసరికే..
నేలపై పడి గిలగిల కొట్టుకుంటోందని పనివాళ్లు ఫోన్‌ చేసి చెప్పారు. నేను ఇంటికెళ్లేసరికి తన పరిస్థితి మరింత దిగజారింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లాం, కానీ తనను కాపాడుకోలేకపోయాం. ఐస్‌క్రీమ్‌ అలర్జీ వల్ల ఊపిరితిత్తుల్లో రంధ్రాలు ఏర్పడ్డాయి. అలా నా భార్య కన్నుమూసింది అని చెప్పుకొచ్చాడు. దక్షిణాదిన వందలాది చిత్రాల్లో నటించిన దేవన్‌ తెలుగులో ఆశయం, పెళ్లి చేసుకుందాం, మా అన్నయ్య, దేశముదురు, ఏమాయ చేసావె, హార్ట్‌ ఎటాక్‌, సాహొ వంటి పలు చిత్రాల్లో నటించాడు. ఎక్కువగా విలన్‌ పాత్రలతోనే మెప్పించాడు.

చదవండి: 'లోక' @ రూ.200 కోట్లు.. గర్వాన్ని తలకెక్కించుకోవద్దన్న తండ్రి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)