Breaking News

వీడియో.. థియేటర్‌లో టపాసులు పేల్చి రచ్చ చేసిన బన్నీ ఫ్యాన్స్‌!

Published on Fri, 04/07/2023 - 10:41

సినిమా రీరిలీజ్‌ అనేది ఇప్పుడు లేటెస్ట్‌ ట్రెండ్‌. హీరోల కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు ఏమేం రిలీజ్‌ అవుతున్నాయని ఎదురుచూస్తున్నారు అభిమానులు. మొన్నామధ్య పవన్‌ కల్యాణ్‌ ఖుషి, మహేశ్‌బాబు ఒక్కడు సినిమాలను రీరిలీజ్‌ చేయగా అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఈమధ్యే ఆరెంజ్‌ సినిమా రీరిలీజ్‌ చేయగా దానికి కూడా భారీ రెస్పాన్స్‌ వచ్చింది. గతంలో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఈసారి మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టడం విశేషం. తాజాగా అల్లు అర్జున్‌ బర్త్‌డే(ఏప్రిల్‌ 8) సందర్భంగా దేశముదురును రీరిలీజ్‌ చేశారు.

బర్త్‌డేకు రెండు రోజుల ముందే ఏప్రిల్‌ 6న గ్రాండ్‌గా రీరిలీజ్‌ చేశారు. సిక్స్‌ప్యాక్‌ ట్రెండ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన అభిమాన హీరో మాస్‌ సినిమా విడుదలయ్యాక ఫ్యాన్స్‌ ఊరుకుంటారా? థియేటర్లకు వరుసకట్టారు. ఈ క్రమంలో సంధ్య 70 ఎమ్‌ఎమ్‌ థియేటర్‌కు అభిమానులు భారీగా తరలివచ్చారు. డైలాగులు, పాటలు వచ్చిన ప్రతిసారి ఈలలు, కేకలు, అరుపులతో థియేటర్‌ దద్దరిల్లిపోయేలా చేశారు. అక్కడివరకు బానే ఉంది అంతటితో ఆగకుండా పేపర్లు చింపుతూ థియేటర్‌ లోపలే టపాసులు పేల్చారు.

ఈ విషయం తెలిసిన పోలీసులు షో ఆపేసి లోనికి వెళ్లి అభిమానులను హెచ్చరించారు. ఈ విషయం గురించి నిర్మాత శ్రీనివాస కుమార్‌ మాట్లాడుతూ.. 'సంధ్య థియేటర్‌ లోపల టపాసులు పేల్చడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దయచేసి అభిమానులు సీట్లకు, థియేటర్‌కు డ్యామేజీ చేయవద్దని కోరుతుతున్నాను. సినిమాను ఎంజాయ్‌ చేయండి. అలాగే దేవాలయాలుగా భావించే థియేటర్లను రక్షించండి' అని ట్వీట్‌ చేశాడు.

కాగా పూరీ జగన్నాథ్‌ డైరెక్ట్‌ చేసిన దేశముదురు 2007 జనవరి 12న విడుదలైంది. ఈ చిత్రంలో హన్సికా మొత్వానీ కథానాయికగా నటించింది. దివంగత మ్యూజిక్‌ డైరెక్టర్‌ చక్రి సంగీతం అందించారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)