Breaking News

'హారర్'‌ సినిమా సూపర్‌హిట్‌.. పార్ట్‌-3 కోసం లైన్‌ క్లియర్‌

Published on Thu, 04/03/2025 - 13:39

కోలీవుడ్‌ దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తీకు గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం 'డీమాంటీ కాలనీ'(Demonte Colony). తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి గుర్తింపు దక్కింది. అరుళ్‌ నిధి కథానాయకుడిగా నటించిన ఈ హారర్‌ కథా చిత్రం 2015లో విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో అజయ్‌ జ్ఞానముత్తు 9 ఏళ్ల తర్వాత డీమాంటీ కాలనీకి సీక్వెల్‌ చేశారు. ఇందులోనూ నటుడు అరుళ్‌ నిధినే కథానాయకుడిగా నటించారు. ఆయనకు జంటగా నటి ప్రియా భవానీ శంకర్‌ నటించారు. అరుణ్‌ పాండ్యన్‌, నటి మీనాక్షి గోవింరాజన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పార్టు 1 కంటే మరింత భారీ బడ్జెట్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది తెరపైకి వచ్చి సూపర్‌ హిట్‌ అయ్యింది.కాగా ఈ చిత్రానికి పార్టు -3 ఉంటుందని చివరిలో లీడ్‌ ఇచ్చారు. 

దీంతో డీమాంటీ కాలనీ సీక్వెల్‌ గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దీంతో ఆ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం డిమాంటీ కాలనీ –3 చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించి చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇందులోనూ అరుళ్‌ నిధినే హీరోగా నటించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)