Breaking News

వాస్తవ సంఘటనలతో 'ఢిల్లీ క్రైమ్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published on Wed, 11/05/2025 - 07:38

ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ సిరీస్‌లు ఎప్పటికీ మెప్పిస్తాయి. అయితే, వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఢిల్లీ క్రైమ్‌ వెబ్‌ సిరీస్‌కు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా సీజన్‌-3 రానుంది. నవంబర్‌ 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఢిల్లీ క్రైమ్‌-3 ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఎవరికీ అంతుప‌ట్ట‌కుండా సాగే వరుస హత్యలను చేధించే క్ర‌మంలో పోలీసుల జ‌రిపే శోధ‌న ఎలా ఉంటుందో ఇందులో చూపారు.

ఢిల్లీ క్రైమ్‌ వెబ్‌ సిరీస్‌ తొలి సీజన్‌ 2019 మార్చి, రెండో సీజన్‌ 2022 ఆగస్టులో విడుదలయ్యాయి. ఈ రెండూ భారీ విజయం అందుకోవడంతో సీజన్‌-3ని తెరకెక్కించారు. ‘ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీ అవార్డు ఫర్‌ అవుట్‌స్టాండింగ్‌ డ్రామా సిరీస్’ అవార్డ్‌ను అందుకున్న తొలి భారతీయ వెబ్‌సిరీస్‌గా ‘ఢిల్లీ క్రైమ్‌’ నిలిచిన సంగతి తెలిసిందే. సీజన్‌-3లొ షెఫాలీ షా, హ్యూమా ఖురేషి, రాజేష్ తైలాంగ్, రసిక దుగల్ నటించారు. రిచీ మెహతా, తనూజ్‌ చోప్రా ఈ సిరీస్‌ని రూపొందించారు.

దేశంలో ఒకప్పుడు నిర్భయ అత్యాచారం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.  ఆ కేసును పోలీసులు ఎలా ఇన్విస్టిగేషన్‌  చేశారనే తీరును  ఫస్ట్‌ సీజన్‌లో చూపారు. వృద్ధులను టార్గెట్‌ చేసుకుని నగరంలో జరిగే వరసు హత్యలకు సంబంధించిన దర్యాప్తు ఆధారంగా రెండో సీజన్‌ రూపొందించారు. అయితే, సీజన్‌-3లో  హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడే ఓ మహిళను డీసీపీ (షెఫాలీ) ఎలా పట్టుకున్నారో చూపించనున్నారు.

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)