Breaking News

'దీపికా పడుకోణె'కు గోల్డెన్‌ ఛాన్స్‌!

Published on Fri, 06/06/2025 - 20:31

అల్లు అర్జున్‌,  దర్శకుడు అట్లీ సినిమా (AA22) నుంచి జూన్‌ 7న ఒక అప్డేట్‌ రానుందని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్ట్‌ పంచుకుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటికే ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి కూడా.. త్వరలో షూటింగ్‌కు సిద్ధం అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం దర్శకుడు అట్లీ హైదరాబాద్‌ చేరుకుని, అల్లు అర్జున్‌తో సినిమా నిర్మాణ పనులకు సంబంధించిన చర్చలు చేశారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 700 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే, శనివారం ఉదయం 11గంటలకు ఒక ఆప్డేట్‌ ఇస్తామని పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. బహుశా హీరోయిన్‌ గురించి ప్రకటన చేస్తారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.

అల్లు అర్జున్‌- అట్లీ (AA22) సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ 'దీపికా పడుకోణె'( Deepika Padukone) నటిస్తున్నట్లు టాక్‌ ఉంది. తనకు సంబంధించిన అప్డేట్‌ శనివారం అఫీషియల్‌గా ప్రకటిస్తారని సమాచారం. ఇదే ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్‌, మృణాల్ ఠాకూర్‌ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే, వారిద్దరి గురించి అధికారిక ప్రకటన కోసం కొద్దిరోజులు వేచి ఉండాల్సిందే. దాదాపు జూన్‌ 7న మాత్రం దీపిక ప్రకటన ఉంటుందని బలంగా వార్తలు వస్తున్నాయి. (AA22) పేరుతో ప్రారంభమైన ఈ మూవీకి ఐకాన్‌, సూపర్‌హీరో అనే టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయని సమాచారం.

ఈ సినిమాలో అల్లు అర్జున్‌ భిన్న గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం. కథకు  తగ్గట్లుగానే  అల్లు అర్జున్‌ పలు లుక్స్‌ను ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పునర్జన్మల కాన్సెప్ట్‌తో ముడిపడి ఉండే సైన్స్‌ఫిక్షన్‌ సినిమాగా ఇది రానున్నట్లు  ప్రచారంలో ఉంది. అందుకోసం చిత్రబృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ ఇప్పటికే రంగంలోకి దిగింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)