Breaking News

షారుక్‌ చెప్పిన పాఠాన్ని ఫాలో అవుతున్నా!

Published on Sun, 09/21/2025 - 04:23

‘‘పద్దెనిమిది సంవత్సరాల క్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమా చేస్తున్నప్పుడు షారుక్‌ ఖాన్‌ నాకు కొన్ని  పాఠాలు నేర్పారు. ఓ సినిమా మేకింగ్, ఆ సినిమా నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఆ  సినిమాలో ఎవరితో కలిసి నటించాం అనే అంశాలు ఆ సినిమా విజయాని కన్నా ముఖ్యమైనవి అని ఆయన చె΄్పారు. షారుక్‌ నాకు నేర్పిన తొలి  పాఠం ఇదే. అప్పట్నుంచి నేను తీసుకునే నిర్ణయాలకు ఈ  పాఠాన్నే అమలు చేస్తున్నాను. షారుక్‌తో ఆరోసారి సినిమా చేస్తుండటానికి ఈ  పాఠమే కారణమై ఉండొచ్చు’’ అని తన తాజా ఇన్‌స్టా  పోస్ట్‌లో దీపికా పదుకోన్‌ పేర్కొన్నారు.

షారుక్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలోని ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, షారుక్‌ తనయ సుహానా ఖాన్, అభిషేక్‌ బచ్చన్‌ ఇతర ప్రధాన  పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ‘కింగ్‌’ సినిమా షూటింగ్‌లోకి తాను అడుగుపెట్టినట్లుగా స్పష్టం చేస్తూ దీపికా పదుకోన్‌ ఇన్‌స్టా వేదికగా ఓ  పోస్ట్‌ను షేర్‌ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ  పోల్యాండ్‌లో జరుగుతోందని, ఈ షెడ్యూల్‌ దాదాపు నెల రోజులకు పైనే ఉంటుందని బాలీవుడ్‌ టాక్‌. ఇక ‘ఓం శాంతి ఓం,  చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్‌’ చిత్రాల్లో షారుక్‌–దీపిక హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా ‘కింగ్‌’ సినిమా కోసం ఈ ఇద్దరు ఆరోసారి కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. మరోవైపు ‘కల్కి 2’ చిత్రంలో దీపిక నటించడం లేదని ఆ చిత్రం మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)