Breaking News

నా నిర్ణయం సరైనదే: దీపికా పదుకోన్‌

Published on Mon, 11/17/2025 - 03:18

‘‘నేనో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మా అమ్మగారిపై మరింత గౌరవం పెరిగింది. వృత్తి జీవితాన్ని, పిల్లల పెంపకాన్ని బ్యాలెన్స్‌ చేయొచ్చని చాలామంది అంటుంటారు. కానీ అది చాలా కష్టమైన పని. కొత్తగా తల్లయిన వారు తిరిగి పనికి వచ్చినప్పుడు వారికి అందరూ సపోర్ట్‌ చేయాలి’’ అని దీపికా పదుకోన్‌ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు 8 గంటలు మాత్రమే పని చేసే వెసులుబాటును కల్పించాలని దీపిక కొంత కాలంగా పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్యూలో మరోమారు ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ– ‘‘రోజుకి 8 గంటల పని మానవ శరీరానికి, మనసుకు సరిపోతుంది.

మనం ఆరోగ్యంగా ఉండి, పని చేసినప్పుడే అవుట్‌పుట్‌ బాగా వస్తుంది. ఒత్తిడితో పని చేస్తే సరైన ఫలితం రాకపోవచ్చు. మా ఆఫీసులో సోమవారం నుంచి శుక్రవారం వరకు మేం 8 గంటలే పని చేస్తాం. వినేవారికి బోరింగ్‌గా ఉండొచ్చు. టైమ్‌ అనేది మన చేతుల్లో ఉన్న ధనంతో సమానం. దీన్ని ఎవరితో, ఎప్పుడు, ఎలా స్పెండ్‌ చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు ఉండాలి. నా దృష్టిలో సక్సెస్‌ అంటే ఇదే. 8 గంటలు మాత్రమే పని చేయాలనే నా నిర్ణయం కరెక్టే’’ అని చెప్పుకొచ్చారు దీపికా పదుకోన్‌.
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)