Breaking News

ప్రభాస్‌‌కి నో-బన్నీతో ఫిక్స్.. దీపిక ప్లాన్ ఏంటి?

Published on Sat, 06/07/2025 - 12:47

అల్లు అర్జున్ కొత్త సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెని ఎంపిక చేశారు. గ్రాండ్ ఇంట్రడక్షన్ వీడియోతో అధికారికంగా ప్రకటించారు. ఇందులో సూపర్ ఉమన్ వారియర్ తరహా పాత్రలో దీపిక కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. సరే ఇదంతా పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం ప్రభాస్ చిత్రానికి నో చెప్పిన ఈమె.. ఇప్పుడు బన్నీ సినిమాకు ఓకే చెప్పింది. ఈ మధ్యలో ఏం జరిగింది? సోషల్ మీడియాలో అసలేం వినిపిస్తోంది.

'యానిమల్' తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌తో 'స్పిరిట్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికీ స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి కాగా హీరోయిన్ పాత్ర కోసం దీపికని సంప్రదించాడు. దాదాపు ఓకే అనుకున్నారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకముందే దీపిక పీఆర్ టీమ్.. ఈ విషయాన్ని పలు వెబ్‌సైట్లకు లీక్ చేసింది. దీపిక పాత్ర ఆహా ఓహో అనే రేంజులో ఉండబోతుందని హైప్ ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత దీపిక తన కండీషన్స్ గురించి సందీప్‌తో చెప్పిందని వార్తలొచ్చాయి. రోజుకి 8 గంటల మాత్రమే పనిచేస్తానని, రూ.40 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా కావాలని దీపిక డిమాండ్ చేసినట్లు టాక్ వినిపించింది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

అలా దీపిక పెట్టిన కండీషన్స్‌తో పాటు ఆమె పీఆర్ టీమ్ చేసే హడావుడి వల్ల సందీప్‌కి చిరాకొచ్చింది. దీంతో దీపికకు నో చెప్పేశాడు. ఇది జరిగిన వెంటనే బాలీవుడ్‌లో 'స్పిరిట్' గురించి నెగిటివ్ ఆర్టికల్స్ వచ్చాయి. స్టోరీని కూడా లీక్ చేశారు. ఇదో 'ఏ' రేటెడ్ సినిమా అని, హీరోహీరోయిన్ మధ్య రొమాన్స్ గట్టిగానే ఉందని పలు సైట్లలో వార్తలొచ్చాయి. దీంతో సందీప్ రెడ్డి వంగాకు మండింది. వెంటనే తృప్తి దిమ్రిని హీరోయిన్‌గా ప్రకటించాడు. దీపిక పేరు ప్రస్తావించకుండా పెద్ద ట్వీట్ పెట్టాడు. ఆమెకు ఇచ్చిపడేశాడు. ఏం చేసుకుంటావో చేస్కో అని అనేశాడు.

ఇది జరిగి కొన్నిరోజుల కూడా కాలేదు ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో దీపికని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. దీనిపై కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. లెక్క ప్రకారం మృణాల్ ఠాకుర్‌ని హీరోయిన్‌గా తొలుత అనౌన్స్ చేయాలనుకున్నారట. కానీ దీపిక నుంచి ఒత్తిడి రావడంతో ఈమెని హీరోయిన్‌గా అనౌన్స్ చేశారని వినిపిస్తోంది. మరి దీపిక చెప్పిన కండీషన్స్‌కి దర్శకుడు అట్లీ ఒప్పేసుకున్నట్లే కనిపిస్తుంది. ఈ సినిమాలో బన్నీ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ప్రతి పాత్రకు ఓ హీరోయిన్ ఉంటుంది. దీపిక కాకుండా మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్‌ని హీరోయిన్లుగా తీసుకోవాలని ఫిక్సయ్యారట.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)