Breaking News

'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం

Published on Sat, 04/19/2025 - 09:46

తెలుగు చిత్రసీమలో తెలుగమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. హీరోయిన్‌గా మెరిసేందుకు చాలా కష్టపడుతుంటారు. అలాంటిది సుమయ రెడ్డి అయితే తన తొలి ప్రయత్నంలోనే హీరోయిన్‌గా, రచయితగా, నిర్మాతగా భిన్న పాత్రల్ని పోషించింది. 'డియర్ ఉమ' అంటూ  ఏప్రిల్ 18న వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించారు. పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌య రెడ్డి( Sumaya Reddy) హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని సాయిరాజేష్ మ‌హాదేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మరి ఈ సుమయ రెడ్డి తొలి ప్రయత్నం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటి..?
గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి)  వైద్య విద్యను పూర్తి చేసి సొంతంగా ఓ హాస్పిట‌ల్ నిర్మించి తండ్రి క‌ల‌ను నెర‌వేర్చాల‌ని అనుకుంటుంది. మరోవైపు దేవ్‌కు(పృథ్వీ అంబ‌ర్‌) మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. భవిష్యత్‌లో రాక్‌స్టార్ కావాల‌ని ఎన్నో క‌ల‌లు కంటాడు. కానీ, చదువులో చాలా వెనుకపడిపోతాడు. తన కాలేజీ సమయంలో దేవ్‌ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే, మ్యూజిక్ కార‌ణంగానే దేవ్‌కు ఆ అమ్మాయి బ్రేక‌ప్ చెప్పి వెళ్లిపోతుంది. ప్రేమలో విఫలమైన దేవ్ రాక్ స్టార్ అవ్వాలనే ప్రయత్నంలో అంతగా సక్సెస్ కాలేకపోతాడు. 

చిన్నా చితకా అవకాశల కోసం గడపగడపకూ తిరుగుతుంటాడు. అలాంటి దేవ్‌కి ఓ సారి ఉమ డైరీ దొరుకుతుంది. తనకు గాయమై హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తన జీవితం మారిందని.. అప్పటి నుంచే ఉమ జీవితం ఆగిపోయిందని తెలుసుకుంటాడు. అసలు ఉమకి ఏం జరిగింది..? ఉమ నేపథ్యం ఏంటి? ఉమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తుండేది? అనే ప్రశ్నలతో సతమతం అవుతుంటాడు దేవ్. ఇక ఉమ కోసం దేవ్ చేసిన పోరాటం ఏంటి? ఉమతో దేవ్ ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఈ కథలో దేవ్ అన్న సూర్య (కమల్ కామరాజ్) పాత్ర ఏంటి..? అన్నది కథ.

వైద్యం పేరుతో కార్పొరేట్ హాస్పిట‌ల్స్ చేసే మోసాల‌కు ల‌వ్‌స్టోరీని జోడించి డియ‌ర్ ఉమ క‌థ‌ను  సుమ‌య రెడ్డి రాసుకుంది. ఈ కథను సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. వైద్య రంగంలోని లోపాలను ఎత్తిచూపుతూ తెరకెక్కించాడు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గుర్తుచేస్తూ, సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా కథను నడిపించారు. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

ఎలా ఉందంటే..?
రధన్ సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది, అయితే, కొన్ని చోట్ల మరింత మెరుగ్గా ఉండాల్సింది. రాజ్ తోట కెమెరా వర్క్ సహజంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన షాట్స్ మిస్ అయినట్టు అనిపించవచ్చు. స్క్రీన్ ప్లే సినిమాకు ఒక బలంగా నిలిచింది, ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అయితే, క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సన్నివేశాలు కొందరికి అతిగా అనిపించవచ్చు. పతాక సన్నివేశంలోని పాట సినిమా  సందేశాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ, కథలో మరింత సహజంగా కలిసిపోయి ఉంటే బాగుండేది. మొత్తానికి, "డియర్ ఉమర్" ఒక మంచి ప్రయత్నం, కానీ కొన్ని అంశాలలో మరింత శ్రద్ధ పెడితే ఇది ఒక గొప్ప చిత్రంగా నిలిచేది. తొలి చిత్రమే అయినా సుమ చిత్ర ఆర్ట్స్, నిర్మాత సుమయ రెడ్డి గొప్ప కథను అందించడంలో సక్సెస్ అయ్యారు.

డియర్ ఉమ చిత్రానికి సుమయ రెడ్డి ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. మంచి కథను ఇవ్వడమే కాకుండా.. ఈ కథను అనుకున్నట్టుగా తీయడంలో ఖర్చు పెట్టిన నిర్మాతగానూ సుమయ రెడ్డి సక్సెస్ అయింది. సుమయ రెడ్డిలోని రచయిత, నిర్మాతకు వంద మార్కులు వేసుకోవచ్చు. ఇక నటిగా ఇంకాస్త మెరుగు పర్చుకోవాల్సి ఉంటుందేమో. తెరపై సుమయ రెడ్డి అందంగా కనిపించారు. హీరోగా పృథ్వీ అంబర్ యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కమల్ కామరాజ్ పాత్ర సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. అజయ్ ఘోష్ పాత్ర రొటీన్ అనిపిస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పోషించిన పాత్రలు అక్కడక్కడా నవ్విస్తాయి.  పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోకుండా డియర్‌ ఉమను చూస్తే తప్పకుండా మెప్పిస్తుంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి