Breaking News

బాలీవుడ్‌ హీరోయిన్‌ను పిచ్చిగా ప్రేమించిన దావూద్‌.. కానీ..

Published on Tue, 12/19/2023 - 13:32

మోస్ట్‌ వాంటెడ్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం చావుబతుకుల మధ్య ఉన్నాడంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరైతే ఏకంగా ఆయన చనిపోయాడని అంటున్నారు. దీనిపై ఆయన అనుచరుడు చోటా షకీల్‌ స్పందిస్తూ భాయ్‌ క్షేమంగా ఉన్నాడని, తన ఆరోగ్యం క్షీణించిందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత దావూద్‌ పేరు తెరపైకి రావడంతో సాధారణ క్రిమినల్‌ నుంచి డాన్‌గా ఎదిగిన తీరును, అతడి దుర్మార్గాలను గుర్తు చేసుకుంటున్నారు జనాలు. 

హీరోయిన్‌తో ప్రేమాయణం
ఈ డాన్‌కు క్రిమినల్స్‌తోనే కాదు బాలీవుడ్‌తోనూ సంబంధాలున్నాయి. హీరోయిన్‌ మందాకినిని ఎంతో ఆరాధించాడు దావూద్‌. ఆమెను కూడా ప్రేమ ముగ్గులోకి దింపాడు. ఈ మందాకిని.. 80వ దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. తన అందం, అభినయంతో కుర్రకారుకు కంటి మీద నిద్ర లేకుండా చేసింది. 1985లో రిలీజైన రామ్‌ తేరి గంగా మెయిలీ సినిమా ఆమె కెరీర్‌లోనే టాప్‌ మూవీగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌తో ఎన్నో అవకాశాలు ఆమె ఇంటి తలుపు తట్టాయి. ఈ నటి.. సింహాసనం, భార్గవ రాముడు చిత్రాలతో తెలుగువారికీ పరిచయమైంది. కానీ ఒకే ఒక్క ఫోటో ఆమె కెరీర్‌నే నాశనం చేసింది. 1994లో దావూద్‌తో మందాకిని కలిసి ఉన్న ఫోటోలు లీకయ్యాయి. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది.

ఆ మోడల్‌ కోసం హత్య
మొదట తనకేం తెలియదని బుకాయించిన హీరోయిన్‌ ఆ తర్వాత మాత్రం తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని చెప్పింది. ఈ సంఘటన వల్ల మందాకినికి అవకాశాలు రావడం ఆగిపోయాయి. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పి కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది నటి. అనంతరం డాక్టర్‌ కాగ్యుర్‌ రింపోచే ఠాకూర్‌ను పెళ్లాడి విదేశాల్లో సెటిలైంది. వీరికి రబ్బిల్‌ అనే కుమారుడు, రబ్జే ఇనయ అని ఓ కూతురు ఉన్నారు. ఇదిలా ఉంటే నటి, మోడల్‌ అనిత అయ్యుబ్‌ కూడా దావుద్‌ ప్రియురాలే అని ఓ ప్రచారం ఉంది. ఈమెను సినిమాలోకి తీసుకోవడానికి నిర్మాత జావెద్‌ సిద్దిఖి నిరాకరించడంతో దావూదే అతడిని కాల్చి చంపాడని చెప్తుంటారు.


దావూద్‌ ఇబ్రహీంతో మందాకిని

చదవండి: నా దేశంలో రక్షణ లేకుండా పోయింది.. అడుగు బయటపెట్టాలంటేనే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)