Breaking News

‘రాబిన్‌హుడ్‌’లో డేవిడ్‌ వార్నర్‌.. రెమ్యునరేషన్‌ ఎంతంటే?

Published on Thu, 03/06/2025 - 09:01

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌(David Warner)లో ఓ మంచి నటుడు ఉన్నాడు. యాక్టింగ్‌ అంటే అతనికి పిచ్చి. లాక్‌డౌన్‌ సమయంలో ఎన్నో టిక్‌టాక్‌ వీడియోలు చేసి అలరించాడు. అల్లు అర్జున్‌, ప్రభాస్‌, మహేశ్‌బాబుతో పాటు పలువురు టాలీవుడ్‌ హీరోల పాటలకు స్టైప్పులేస్తూ దక్షిణాది సీనీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఓ తెలుగు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నితిన్, శ్రీలీల జంటగా  వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’( Robinhood Movie). మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డేవిడ్‌ వార్నర్‌ కీలక పాత్ర పోషించాడట. ఈ విషయాన్ని ఇన్నాళ్లు గోప్యంగా ఉంచిన మేకర్స్‌.. తాజాగా ఓ ఈవెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

డేవిడ్‌ వార్నర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారనే విషయం తెలియగానే..అటు క్రికెట్‌ అభిమానులతో పాటు ఇటు సీనీ లవర్స్‌ కూడా ‘రాబిన్‌హుడ్‌’లో ఆయన పాత్ర ఎలా ఉంటుంది? అసలు ఆ పాత్రలో నటించడానికి వార్నర్‌ ఎంత తీసుకున్నాడు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. టాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం.. వార్నర్‌కి రూ.50 లక్షలను రెమ్యునరేషన్‌గా అందించారట నిర్మాతలు. అయితే వార్నర్‌ మాత్రం రెమ్యునరేషన్‌ విషయంలో ఎలాంటి డిమాండ్‌ చేయలేదట . సరదా కోసమే ఆ పాత్రను చేస్తానని అంగీకరించాట. కానీ నిర్మాతలే ఆయనకు ఉన్న క్రేజీని దృష్టిలో పెట్టుకొని చిన్న పాత్రలో నటించినా.. భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ అందించారట. 

ఇక రాబిన్‌హుడ్‌ విషయానికొస్తే.. ‘భీష్మ' వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ ఇది. హానీ సింగ్ అనే పాత్రలో నితిన్ నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. మార్చి 28న ప్రేక్షకుల ము​ందుకు రానుంది. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)