Breaking News

హీరోయిన్‌గా మాజీ డీజీపీ కూతురు.. సినిమా రెడీ

Published on Fri, 07/03/2026 - 11:38

తమిళ ప్రముఖ హీరో రవి మోహన్‌ అలియాస్ జయం రవి నటించిన లేటెస్ట్ మూవీ కరాటే బాబు. 'డాడా' ఫేమ్ గణేష్‌ కె బాబు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలోకి రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. అయితే ఈ మూవీతో తమిళనాడు మాజీ డీజీపీ శంకర్‌ జివాల్‌ కూతురు హీరోయిన్‌గా పరిచయమవుతుండటం విశేషం.

(ఇదీ చదవండి: ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలెందుకు?.. ప్రకాశ్ రాజ్)

మాజీ డీజీపీ కుమార్తె పేరు దౌదీ జివాల్‌. ఇకపోతే ఈ సినిమాలో కేఎస్‌ రవికుమార్‌, వీటివీ. గణేష్‌ తదితరులు ఇతర పాత్రలు చేశారు. సుందర్‌ ఆరుముగం నిర్మాత. ఇంతకుముందు ఈయన రవి మోహన్‌‌తో అఖిలన్‌, బ్రదర్‌ లాంటి మూవీస్ తీశారు. ఇది మాత్రం రాజకీయ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించారు.

ఇంతకుముందు రాజకీయ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయని అయితే వాటికి పూర్తి భిన్నంగా 'కరాటే బాబు' ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితం, బంధాలు, అనుబంధాలను ఆవిష్కరించే కథ చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా శాసనసభ్యుడిలోని మరో కోణాన్ని ఆవిష్కరించే రాజకీయ థ్రిల్లర్‌‌గా తెరకెక్కించారట.శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని, ఎళిల్‌ అరసు.కె ఛాయాగ్రహణం అందించారు.

(ఇదీ చదవండి: సూపర్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)