Breaking News

ఆస్కార్‌ బరిలో మొట్టమొదటి మరాఠి సినిమా!

Published on Mon, 01/05/2026 - 09:51

మరాఠి సినిమా దశావతార్‌ (2025) అరుదైన ఘనత సాధించింది. ఆస్కార్‌ అవార్డుల పోటీలో నిలిచిన తొలి మరాఠి చిత్రంగా నిలిచింది. దిలీప్‌ ప్రభావాల్కర్‌, మహేశ్‌ మంజ్రేకర్‌, సిద్దార్థ్‌ మీనన్‌, ప్రియదర్శిని ఇందాల్కర్‌, భరత్‌ జాదవ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ దశావతార్‌. 

కలెక్షన్స్‌
సుబోద్‌ ఖనోల్కర్‌ దర్శకత్వంలో ఓషన్‌ ఫిలిం కంపెనీ, ఓషన్‌ ఆర్ట్‌ హౌస్‌ సంస్థలు నిర్మించిన ఈ మూవీ గతేడాది సెప్టెంబరులో విడుదలైంది. థియేటర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం దాదాపు రూ.25 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించింది. తాజాగా దశావతార్‌ 98వ ఆస్కార్‌ అవార్డ్స్‌లోని మెయిన్‌ ఓపెన్‌ ఫిలిం విభాగంలో పోటీలో నిలిచింది.

మరికొద్ది రోజుల్లో తుది జాబితా
ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సుబోద్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో హిందీ నామినేషన్‌లో పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే! ఇకపోతే జనవరి 22న ఆస్కార్‌ నామినేషన్స్‌ దక్కించుకున్న చిత్రాల జాబితా ఫైనల్‌ లిస్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తారు. మార్చి 15న అమెరికాలో ఈ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

 

 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)