Breaking News

ఆ లీక్ వీరులెవరో నాకు తెలుసు.. దసరా డైరెక్టర్‌ ఆగ్రహం!

Published on Sun, 11/10/2024 - 16:55

దసరా మూవీతో సూపర్ హిట్‌ తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆయన నానితో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి సంబంధించి టైటిల్‌ లీక్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై దర్శకుడు శ్రీకాంత్ మండిపడ్డారు.

నా మూవీ టైటిల్‌ లీక్‌ చేసింది ఎవరో తనకు తెలుసని శ్రీకాంత్ ఓదెల అన్నారు. మా టీమ్‌తో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నా సినిమాకు మాత్రమే కాదు.. ఏ సినిమాకైనా లీకుల బెడద ఉంటే అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌, రచయితలను తప్పుపట్టడం మానేస్తే మంచిదని ఆయన హితవు పలికారు.  వాళ్లు సినిమా రంగంలో  క్రియేటర్స్‌ అని కొనియాడారు. సినిమాలకు వారు అందించే నిస్వార్థమైన సేవలను  గౌరవించాలని.. అంతేగానీ కష్టపడి పనిచేసే డిపార్ట్‌మెంట్లపై నిందలు మోపడం సరికాదని శ్రీకాంత్ అన్నారు.

కాగా.. శ్రీకాంత్‌.. నానితో తెరకెక్కిస్తోన్న చిత్రానికి ది ప్యారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ మూవీ యూనిట్ ప్రకటించకముందే సోషల్ మీడియాలో లీకైంది. దీంతో ఈ విషయంపై శ్రీకాంత్ ఓదెల ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు