Breaking News

‘దసరా’కు దిమ్మతిరిగే కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎంతంటే?

Published on Sat, 04/01/2023 - 13:26

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’ ఇప్పుడు బాక్సాఫీస్‌ వద్ద సునామీని సృష్టిస్తోంది. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం..తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఊరమాస్‌ నటనతో అదరగొట్టేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు నాని, కీర్తి సురేశ్‌ నటనతో పాటు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల పనితనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

(చదవండి: ‘దసరా’మూవీ రివ్యూ)

ఫలితంగా కలెక్షన్స్‌ పరంగా ‘దసరా’ దూసుకెళ్తోంది.  తొలి రోజే రూ.38 కోట్ల గ్రాస్‌ వ‌సూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.15 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టి సత్తా చాటింది. మొత్తం రెండు రోజుల్లో దాదాపు రూ.53 కోట్లు గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది.  నైజాం ఏరియాలో ఈ సినిమా రూ. 10.25 కోట్లకు పైగా వసూలు చేసి బ్రేక్‌ ఈవెన్‌ సాధించిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.  

ఇక ఓవర్సీస్‌లోనూ ‘దసరా’దూసుకెళ్తోంది. రెండు రోజుల్లో అక్కడ 1.2 మిలియన్‌ డాలర్లను వసూలు చేసి నాని ఖతాలో నయా రికార్డును చేర్చింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి టాక్‌ వచ్చింది. కాబట్టి ఈ వీకెండ్‌లో కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేశ్‌ నటించింది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)