Breaking News

నా హృదయం ముక్కలు.. హద్దులు మీరుతున్నారు: దర్శన్‌ భార్య

Published on Sun, 01/04/2026 - 19:56

వేధింపులను భరించాల్సిన అవసరం లేదంటోంది కన్నడ హీరో దర్శన్‌ భార్య విజయలక్ష్మి. తనపై ఆన్‌లైన్‌ వేధింపులు తీవ్రతరం అవడంతో ఇటీవలే ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో ట్రోలింగ్స్‌ ఎదుర్కోవడం నాకు ఇదేం మొదటిసారి కాదు. నాలుగేళ్ల క్రితం నా ఫోటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వదిలారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. 

నాకే ఇలా జరుగుతుందంటే..
కానీ, ఈసారి వేధింపుల తీవ్రత మరింత పెరిగింది. కొందరు హద్దులు దాటుతూ ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి హీనమైన చర్యలను ఏమాత్రం సహించకూడదు. నాకే ఇలా జరుగుతుంటే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? ఎంతోమంది అమ్మాయిలు ఆన్‌లైన్‌లో వేధింపులకు గురవుతున్నారు, అది తల్చుకుంటేనే నా హృదయం ముక్కలవుతోంది.

నిశ్శబ్ధాన్ని వీడండి
తప్పు చేసేవారు భయపడాలి, మనం కాదు! ఎవరికోసమో మీరు మారక్కర్లేదు. ట్రోలర్స్‌ను లెక్క చేయకండి. నిశ్శబ్ధంగా కుమిలిపోకండి, బయటకు రండి, మీపై జరుగుతున్న వేధింపులను నిలదీయండి. ధైర్యంగా ఫిర్యాదు చేయండి. అయితే మహిళా భద్రత విషయంలో సైబర్‌ న్యాయ వ్యవస్థ మరింత కఠినంగా, సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది అని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది.

జైలు జీవితం
ఇకపోతే అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌ జైలుపాలైన విషయం తెలిసిందే! ప్రియురాలు పవిత్రకు అసభ్య సందేశాలు, అశ్లీల ఫోటోలు పంపాడన్న కోపంతో దర్శన్‌ కొందరు మనుషులతో కలిసి రేణుకాస్వామిని చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే దర్శన్‌ జైలు జీవితం గడుపుతున్నాడు.

చదవండి: సినిమా ఫ్లాప్‌.. నాకు బాగా కలిసొచ్చింది: బాలీవుడ్‌ నటి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)