Breaking News

ఆసుపత్రిలో చేరిన నటుడు దర్శన్‌

Published on Sat, 11/02/2024 - 13:31

రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్‌ ఆరోగ్యం కొద్దిరోజులుగా మెరుగ్గాలేదు. దీంతో తనకు అత్యవసర చికిత్స అవసరం అంటూ కోర్టుకు వెళ్లడంతో ఆయనకు బెయిల్‌ మంజూరు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన సుమారు 140 రోజుల నుంచి జైలులో ఉన్నారు. దర్శన్‌కు 6 వారాలు పాటు బెయిలు అమల్లో ఉంటుంది.

తీవ్రమైన వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న దర్శన్‌ తాజాగా ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఆయన లాయర్‌ నాగేశ్‌ తెలిపారు. దర్శన్‌కు వెన్నులో ఎల్‌–5, ఎస్‌–1 డిస్క్‌లలో సమస్య ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మైసూరులో ఒక ప్రముఖ ఆసుపత్రిలో దర్శన్‌ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై డాక్టర్ నవీన్ అప్పాజీ గౌడ ఇలా చెప్పారు.

చికిత్స చేస్తున్న డాక్టర్ నవీన్ అప్పాజీ గౌడ్ శుక్రవారం మాట్లాడుతూ.. దర్శన్‌ కాలిలో శక్తి కోల్పోయినట్లు ఉందని తెలిపారు. ఆయన వెన్ను భాగంలో తీవ్రమైన నొప్పి ఉండటం వల్ల కాలిలో కూడా ఆ ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దర్శన్‌కు ఇప్పటికే ప్రాథమిక చికిత్సలు ప్రారంభించామని తెలిపారు. పూర్తి రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత అవసరం అయితే ఆపరేషన్‌ కూడా చేయాల్సి రావచ్చని చెప్పారు. బళ్లారి కేంద్ర కారాగారంలోని వైద్యులు పంపిన మెడికల్ రిపోర్టులను కూడా తాము పరిశీలించామని పేర్కొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)