Breaking News

నటుడు దర్శన్‌ కస్టడీ ముగింపు.. బెయిల్‌ కోసం దరఖాస్తు

Published on Sun, 09/08/2024 - 13:21

 కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో ‍ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్‌, పవిత్రగౌడ ఉన్నారు. వారిద్దరూ సుమారు నాలుగు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి   దర్శన్‌ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు. వారిద్దరితో పాటు మరో 15 మంది పాత్ర కూడా ఉన్నట్లు 3,991 పేజీలతో   చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్‌బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు.

రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నిందితుల జ్యుడీషియల్ కస్టడీ గడువు సెప్టెంబర్‌ 9న సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నటుడు దర్శన్ సహా నిందితులంతా రేపు జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుకానున్నారు. ఇతర నిందితులను మైసూరు, తుమకూరు, షిమోగా, ధార్వాడ్, బెల్గాం, విజయపుర, కలబురగి జైలుకు తరలించారు. నిందితుల జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియనుండడంతో నిందితులను తమ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు 24వ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.

పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ మొత్తం 17 మంది నిందితులకు అందజేయనున్నారు. చార్జిషీటు అందిన తర్వాత చాలా మంది నిందితులు రేపు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును సమర్పించినందున ప్రధాన నిందితులైన దర్శన్, పవిత్రగౌడ్ సహా సోమవారం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)