Breaking News

ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా ‘డార్క్‌ నైట్‌’

Published on Sat, 02/15/2025 - 15:01

‘‘ప్రస్తుతం థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తున్న చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా యువత బాగా చూస్తున్నారు. ఆ నేపథ్యంలో రూపొందిన ‘డార్క్‌ నైట్‌’ చిత్రం టీజర్‌ బాగుంది’’ అని డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ పేర్కొన్నారు. హీరోయిన్‌ పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డార్క్‌ నైట్‌’. జీఆర్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో విధార్ధ్, త్రిగుణ్‌ (అదిత్‌ అరుణ్‌), సుభాశ్రీ రాయగురు, రమా ఇతర పాత్రలు పోషించారు. పటోళ్ల వెంకట్‌ రెడ్డి సమర్పణలో సురేష్‌ రెడ్డి కొవ్వూరి నిర్మించారు.

 ఈ సినిమా టీజర్‌ని వీవీ వినాయక్‌ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘మా ప్రాంతం నుంచి వచ్చిన సురేష్‌ రెడ్డిగారు ‘డార్క్‌ నైట్‌’ చిత్రంతో నిర్మాతగా పరిచయమవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయంతో ఆయన మరిన్ని చిత్రాలు తీసి, తెలుగు పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా నిలబడాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. 

‘‘ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘డార్క్‌ నైట్‌’. జీఆర్‌ ఆదిత్య ఆద్యంతం ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ఈ సినిమాని మలిచాడు. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’  అన్నారు సురేష్‌ రెడ్డి కొవ్వూరి. ఈ చిత్రానికి సంగీతం: మిస్కిన్, కెమేరా: కార్తీక్‌ ముత్తుకుమార్‌.  

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)