Breaking News

ధనుష్‌ వారసుడు ఎంట్రీ.. 'యాత్ర'కు రజనీకాంత్‌ ఇమేజ్‌

Published on Fri, 01/30/2026 - 07:08

కథానాయకుడు, కథా రచయిత, గీత రచయిత, గాయకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు ముఖాలు కలిగిన నటుడు ధనుష్‌. టాలీవుడ్‌ నుంచి, హాలీవుడ్‌ వరకు తన సినీ సామ్రాజ్యాన్ని విజయవంతంగా విస్తరించుకుంటూ పోతున్న ఈ  మల్టీటాలెంట్‌ స్టార్‌  ఒక పక్క హీరోగా నటిస్తునే మరో పక్క దర్శకుడిగా, నిర్మాతగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన ఇటీవల స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఇడ్లీ కడై చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ధనుష్‌ తన 55వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి అమరన్‌ చిత్రం ఫేమ్‌ రాజ్‌ కుమార్‌ పెరియస్వామి కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.

ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ ప్రేమించుకుని పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సుమారు 17 ఏళ్ల తర్వాత మనస్పర్థలు కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఇటీవలే విడాకులు కూడా పొందారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందులో పెద్దవాడి పేరు యాత్ర  ఇతన్ని ఇప్పుడు ధనుష్‌ కథానాయకుడిగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. 

మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు ధనుష్‌ నే దర్శకత్వం వహించడంతో పాటూ తన వండర్‌ బార్‌ పతాకంపై నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇదే నిజం అయితే, ధనుష్‌ కుమారుడికి మంచి  ఎంట్రీనే దొరుకుతుంది. తన తాతయ్య రజనీకాంత్‌ ఇమేజ్‌ కూడా యాత్రకు కలిసొస్తుంది.  కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు అన్నది గమనార్హం.  

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు