Breaking News

16 ఏళ్ల వయసులో రజనీకాంత్‌ ఇంటికి వెళ్లినప్పుడే నిర్ణయించుకున్నా: ధనుష్‌

Published on Mon, 07/08/2024 - 07:55

తమిళసినిమా: బహుముఖ ప్రతిభావంతుడు బహుబాషా నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం రాయన్‌. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. ఎస్‌జే సూర్య, ప్రకాష్‌ రాజ్‌, సందీప్‌కిషన్‌, కాళిదాస్‌ జయరాం, దూసరా విజయన్‌, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందించారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా  ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మేకర్స్‌ నిర్వహించారు. ఈ వేదికపై నటుడు ధనుష్‌ పలు ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తే బాగుంటుందని ఆయనకు ఫోన్‌ చేసి ఇది తన 50వ చిత్రం అని చెప్పానన్నారు. అందుకు ఆయన తాను ప్రస్తుతం చాలా చిత్రాలు చేస్తున్నానని రెండు రోజుల్లో నీకు ఏ విషయం చెప్తానని అన్నారు. అన్నట్లుగానే రెండు రోజుల తర్వాత ఫోన్‌ చేసి మీ చిత్రం చేస్తున్నాను అని చెప్పారు అన్నారు. అప్పుడు తనకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అన్నారు.

కాగా ఇటీవల ధనుష్‌పై చాలా వదంతులు ప్రచారం అయిన విషయం తెలిసిందే. వాటిపై కూడా స్పందించిన ధనుష్‌ తానేంటో తనకు తెలుసని తన తల్లిదండ్రులకు, తన మిత్ర బృందానికి తెలుసని, ప్రారంభ దశ నుంచి బాడీ షేమింగ్‌కు గురయ్యారని పేర్కొన్నారు. అదేవిధంగా అనవసరపు వదంతులు, చెడ్డ పేరు, వెన్నుపోట్లు అంటూ పలు విషయాలు జరిగిన ఇంకా తాను ఇప్పుడిలా మీ ముందు నిలబడ్డానంటే అందుకు మీరే (ప్రేక్షకులను ఉద్దేశించి) కారణం అన్నారు. 

అదేవిధంగా తాను పోయెస్‌గార్డెన్లో ఇల్లు నిర్మించుకోవడానికి కారణాన్ని కూడా తెలుపుతూ పదహారేళ్ల వయసులోనే సెక్యూరిటీని బతిమాలి పోయెస్‌ గార్డెన్లోని రజనీకాంత్‌ ఇంటిని చూడడానికి వెళ్లారన్నారు. అప్పుడే తాను ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక కలిగిందన్నారు. దాన్ని ఇటీవలే నెరవేర్చుకున్నట్లు ధనుష్‌ పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం పోయెస్‌ గార్డెన్స్‌లో సుమారు రూ. 150 కోట్లతో తనకు నచ్చిన విధంగా అద్భుతమైన ఇల్లు ధనుష్‌ నిర్మించారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)