Breaking News

అన్నయ్య, ఎందుకింత పని చేశావు?: కండక్టర్‌ ఝాన్సీ ఎమోషనల్‌

Published on Mon, 05/01/2023 - 09:13

ఢీ డ్యాన్స్‌ షోలో కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధ తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఢీ షో వల్ల మంచి పేరు వచ్చింది, కానీ తగినంత సంపాదన రాలేదని ఆయన వాపోయారు. తాజాగా ఆయన మరణంపై డ్యాన్సర్‌ ఝాన్సీ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. 'చైతన్య అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల తన కుటుంబం బాధపడుతోంది. తను డబ్బులు ఇవ్వాల్సిన కళాకారులతో కూర్చుని మాట్లాడాల్సింది. ఎందుకంటే.. అందరూ తనతో కలిసి ప్రయాణం చేసినవాళ్లే! నా పరిస్థితి ఇలా ఉంది, చచ్చిపోవాలనిపిస్తోందని చెప్పుంటే ప్రతి ఒక్క డ్యాన్సర్‌ కరిగిపోయేవాళ్లు.

మా కళాకారులు డబ్బులు ఇవ్వమని వేధించేంత కఠినమైనవాళ్లు కాదు. అన్నయ్య.. ఎందుకింత పని చేశావో అర్థం కావడం లేదు. మీరెంత మంచివాళ్లంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా తోటివారికి సాయం చేసేవాళ్లు. ఇటీవల జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో అన్నయ్యకు కొంత డబ్బు రావాల్సి ఉంది. కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. కానీ మిగతా కొంతమంది ఆర్టిస్టులు అన్నయ్యకు హ్యాండిచ్చారు. దీంతో కమిటీ వాళ్లు రూ.6-7 లక్షలు పేమెంట్‌ ఇవ్వకుండా ఆపేశారు.

అక్కడికి వచ్చిన ఆర్టిస్టులు తమకు డబ్బులివ్వకపోతే ఊరుకోరు కాబట్టి చైతన్య అన్నయ్య వేరే దగ్గర అప్పు తెచ్చి వాళ్లకు డబ్బులిచ్చారు. కళాకారులకు అన్యాయం చేయకూడదన్న మనస్తత్వం ఆయనది. ఇలా పేమెంట్‌ సర్దే క్రమంలో అప్పు మీద అప్పు చేస్తూ తను ఇబ్బందిపడ్డారు. నాలుగైదు రోజుల క్రితమే ఆయన్ని కలిశాను. నాకు ఢీ షోలో కనిపించాలనుంది, ఒక ఛాన్స్‌ ఇవ్వండి అని చెప్తే నెక్స్ట్‌ సీజన్‌లో ఛాన్స్‌ ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన ఎంత ఎత్తులో ఉన్నా తన కింద ఉన్న కళాకారులకు ఎంతో మర్యాద ఇస్తారు' అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది కండక్టర్‌ ఝాన్సీ.

చదవండి: దుబాయ్‌లో లగ్జరీ విల్లా కొన్న మహేశ్‌బాబు
డీ డ్యాన్స్‌ షో కొరియోగ్రాఫర్‌ ఆత్మహత్య

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)