Breaking News

మొన్నే భర్తను తిట్టింది.. ఇప్పుడేమో పెళ్లి వీడియో.. అంతలోనే..

Published on Sat, 06/01/2024 - 19:24

బుల్లితెర నటి దల్జీత్‌ కౌర్‌కు పెళ్లి అచ్చి రావడం లేదు. 2009లో నటుడు షాలిన్‌ బానోత్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి జైడన్‌ అనే కుమారుడు జన్మించాడు. విడదీయలేని బంధం అనుకునేలోపే మనస్పర్థల వల్ల 2015లో విడాకులు తీసుకున్నారు. తర్వాత దుబాయ్‌లో జరిగిన పార్టీలో నిఖిల్‌ పటేల్‌ అని వ్యక్తి పరిచయమయ్యాడు. అతడికి ఆల్‌రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. కానీ అప్పటికే భార్యతో విడిపోయి కూతురితో కలిసి జీవిస్తున్నాడు. 

ఏడాది తిరిగేసరికే..
అటు దల్జీత్‌.. ఇటు నిఖిల్‌.. ఇద్దరూ సింగిల్‌ పేరెంట్సే అవడంతో పిల్లల గురించి మాట్లాడుకున్నారు. ఈ కబుర్లు కాస్తా ప్రేమకు దారితీశాయి. దీంతో ఇద్దరూ గతేడాది మార్చిలో రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఏడాది తిరిగేసరికే ఇద్దరి మధ్య ప్రేమ కనుమరుగైంది. మౌనం ఆవహించింది. కొడుకును తీసుకుని దల్జీత్‌ పుట్టింటికి వచ్చేసింది. పెళ్లి ఫోటోలు డిలీట్‌ చేసింది. భర్త చీటింగ్‌ చేశాడని సోషల్‌ మీడియాలో భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

పెళ్లి వీడియో షేర్‌ చేసిన నటి
నెట్టింట ఇంత రచ్చ చేసిన ఆమె శనివారం నాడు గతేడాది జ్ఞాపకాలు అంటూ నిఖిల్‌తో జరిగిన పెళ్లి వీడియో షేర్‌ చేసింది. అందులో హల్దీ, పెళ్లి, రిసెప్షన్‌ అన్నీ ఉన్నాయి. నాన్నకు తోడు దొరికిందంటూ నిఖిల్‌ కూతురు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. పదిహేను నెలల క్రితం అన్న క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్‌ చేసిన నటి కొద్ది క్షణాల్లోనే దాన్ని డిలీట్‌ చేసింది. అప్పటికే అది చూసిన నెటిజన్లు.. అక్కడే ఆగిపోకు.. ముందుకు సాగాలికదా.. అతడు నిన్ను మోసం చేశాడు.. కొంచెమైనా ఆత్మాభిమానం ఉందా? అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు.

చదవండి: ఉన్నదంతా స్టార్‌ హీరోలకే.. మిగతా యాక్టర్స్‌కు ఏం మిగలట్లేదు!

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)