Breaking News

‘దల్‌ దల్‌’ రివ్యూ.. గుండె ధైర్యం ఉంటేనే ఈ సిరీస్‌ చూడండి!

Published on Thu, 02/12/2026 - 19:04

అది సినిమా అయినా, జీవితం అయినా వాటిలో కొన్ని ఘటనలను చూడాలన్నా, వినాలన్నా దమ్ముండాలి. ప్రేక్షకులందరూ ఒకేలా ఉండరు. కొన్ని సన్నివేశాలను, ఘటనలను చూడాలంటే కొందరికి ధైర్యం తప్పనిసరి. ఆ కోవలోకి చెందినదే దల్ దల్ వెబ్ సిరీస్. ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ ఏడు భాగాల వెబ్ సిరీస్ చూసే ప్రేక్షకుడికి చమటలు తెప్పిస్తుందనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా హింస ను చూడలేనివారు ఈ సిరీస్ గురించి మర్చిపోవడమే మేలు. అంతలా ఈ సిరీస్ లో ఏముందో ఓ సారి చూద్దాం.

అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ దల్ దల్ సిరీస్ మొత్తం ఓ సీరియల్ కిల్లర్ కేసు చుట్టూనే తిరుగుతుంది. అతి చిన్న వయస్సులో ముంబై నగరానికి డీసిపి అయిన రీటా ఫెరారియాకి ఆ కేసు ఓ సవాలుగా మారుతుంది. ఇంతకీ  కేసు ఏంటంటే నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలు కూడా ఒకే పంథాలో ఓ సీరియల్ కిల్లర్ చేస్తూ ఉంటాడు.  కిల్లర్ పోలీసులకు ఏమాత్రం  క్లూ కూడా వదలకుండా చాలా పకడ్బందీగా హత్యలు చేస్తుంటాడు. హత్య గావించబడ్డ బాధితులు అతి దారుణంగా హింసించి హత్య చేయబడుతుంటారు. ఈ విషయం పై మీడియా పోలీసులపై ఒత్తిడి పెంచుతుంది. అందులోనూ అనితా ఆచార్య అనే జర్నలిస్టు ఏకంగా డీసిపి అయిన రీటాని టార్గెట్ చేస్తూ కార్నర్ చేస్తూ ఉంటుంది. 

విచారణలో భాగంగా రీటా నేరస్తుడిని కనుక్కునే ప్రయత్నంలో తాను ఆ కేసునుండి తప్పుకోవాల్సి వస్తుంది. నిజానికి కిల్లర్ వేసిన ప్లాన్ వల్లనే ఇలా జరుగుతుంది. ఇంతలో పోలీస్ స్టాఫ్ లో ఒకరిని మళ్ళీ సిరీయల్ కిల్లర్ చంపుతాడు. మరి దాదాపుగా నేరస్తుడిని కనుక్కున్న రీటా ఏం చేస్తుంది అన్న విషయం మాత్రం దల్ దల్ చూసే తెలుసుకోవాలి. ఈ సిరీస్ ఓ సైకలాజికల్ త్రిల్లర్, అందులోనూ హింసా నేపధ్యమున్న సిరీస్. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా నడుస్తుంది. ప్రధాన పాత్రధారి రీటా భూమికను పోషించిన భూమి పెడ్నేకర్ సిరీస్ ఆద్యంతం చాలా సీరియస్ గా కనిపించడం, దానితో పాటు సన్నివేశాలలో వచ్చే  దారుణమైన హింసాత్మక ఘటనలను తప్పిస్తే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులతో ఇదో థ్రిల్లింగ్ సీరిస్ . గుర్తుపెట్టుకోండి ఈ దల్ దల్ గుండె నిబ్బరం కలవాళ్ళు మాత్రమే చూడండి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌