Breaking News

మైల్‌స్టోన్‌ దిశగా హీరో ధనుష్‌.. 50వ సినిమా ఫిక్స్‌

Published on Fri, 01/20/2023 - 08:41

తమిళసినిమా: ఆరంభంలోనే తుళ్లువదో ఇళమై అనే చిన్న చిత్రంతో సూపర్‌ హిట్‌ కొట్టిన నటుడు ధనుష్‌. ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్‌ వరకు ఎదిగారు. టాలీవుడ్‌నూ వదల్లేదు. తెలుగులో ధనుష్‌ నటించిన వాత్తి అనే ద్విభాషా చిత్రం (తెలుగులో సార్‌ పేరుతో) త్వరలో విడుదలకు ముస్తాబవుతుంది. అదే విధంగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో మరో చిత్రం కూడా కమిట్‌ అయ్యారు. తాజాగా తిరుచ్చిట్రం ఫలం చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. కాగా ప్రస్తుతం కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రంలో నటిస్తున్నారు.

చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి

ఈ చిత్ర షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుంది. కాగా ధనుష్‌ తాజాగా ఓ మైల్‌స్టోన్‌ను టచ్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. అదే తన 50వ చిత్రం. ఇంతకు ముందు తిరుచ్చిట్రం ఫలం చిత్రాన్ని నిర్మించిన సన్‌పిక్చర్స్‌ సంస్థనే ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మించనుంది. ఇంతకు ముందు రజనీకాంత్‌ కథానాయకుడిగా అన్నాత్తే చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థ ప్రస్తుతం అదే రజనీకాంత్‌ హీరోగా జైలర్‌ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్, తెలుగు నటుడు సునీల్, నటి రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఇందులో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ అతిథి పాత్రలో మెరవనున్నారు.

చదవండి: ట్రోల్స్‌పై స్పందించిన గోపీచంద్‌ మలినేని

నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుందని సమాచారం. మిగతా షూటింగ్‌ ఏప్రిల్‌ నెలాఖరుకి పూర్తి చేసి చిత్రాన్ని ఆగస్టులో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా తదుపరి సన్‌ పిక్చర్స్‌ సంస్థ ధనుష్‌ హీరోగా నటించే చిత్రాన్ని నిర్మించనుంది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం వంటి వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Videos

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

YSR విగ్రహానికి ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో అక్రమ కేసులు

Manohar: కోర్టు తీర్పులను ఉల్లంఘించిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం

Khammam: ఏవో తాజుద్దీన్ హామీతో ధర్నాను విరమించిన రైతులు

ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు DAలు పెండింగ్ లో ఉన్నాయి: హరీశ్ రావు

ఆరావళి పాత తీర్పుపై.. సుప్రీం స్టే..

బోగస్ మాటలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి: వైఎస్ అవినాష్రెడ్డి

ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం లేదు: బీర్ల ఐలయ్య

అమెరికాలో తెలంగాణ స్టూడెంట్స్ మృతి

ఉన్నావ్ కేసులో సుప్రీం షాక్.. నిందితుని బెయిల్ పై స్టే..

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)