Breaking News

దెబ్బ కొట్టిన తుపాన్‌.. ఈ సినిమాలు గట్టెక్కడం కష్టమే!

Published on Wed, 12/06/2023 - 09:38

ఈ వారం విడుదలైన చిన్న చిత్రాలను మిచాంగ్‌ తుపాన్‌ దెబ్బకొట్టింది. తుపాన్‌ ప్రభావంతో చాలా చోట్ల ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇంటి నుంచి కాలు బయటకు పెట్టడానికే జనాలు భయపడుతున్నారు. దీంతో జనాలు లేక థియేటర్లు బోసిపోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తమిళనాట లియో చిత్రం తరువాత జపాన్, జిగర్‌తాండ డబుల్‌ ఎక్స్‌ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో జిగర్‌తాండ డబుల్‌ ఎక్స్‌ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

ఒకేరోజు నాలుగు సినిమాలు'
ఆ తరువాత పెద్ద చిత్రాలేవీ విడుదల కాకపోవడంతో నయనతార నటించిన 'అన్నపూరణి', హరీష్‌ కల్యాణ్‌ నటించిన 'పార్కింగ్', రియోరాజ్‌ నటించిన 'జో', దర్శన్‌ కథానాయకుడిగా నటించిన 'నాడు' వంటి నాలుగైదు చిత్రాలు ఇదే మంచి ఛాన్స్‌ అనుకుంటూ డిసెంబర్‌ 1వ తేదీన థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో లేడీ సూపర్‌ స్టార్‌ నటించిన అన్నపూరణి చిత్రం మినహా అన్నీ చిన్న చిత్రాలే.

దెబ్బకొట్టిన తుపాన్‌
అయినప్పటికీ ఇవన్నీ మంచి కంటెంట్‌తో రూపొందిన చిత్రాలుగా ప్రశంసలు పొందడంతో పాటు ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి. దీంతో ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో తుపాన్‌ వారి ఆనందానికి గండి కొట్టింది. జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఏది గొయ్యో, ఏదో నుయ్యో తెలియనంతగా ఊరు వాడా అంతా జలమయమైంది. థియేటర్లకు వెళ్లడం సంగతి దేవుడెరుగు.. ఇళ్లలోకి నీరు చేరకుండా కాపాడుకోవడమే కష్టంగా మారింది. అలా తుపాన్‌  గండం ఈ వారం విడుదలైన చిత్రాల వసూళ్లకు గండి కొట్టింది.

చదవండి: ఆవేశంతో కాల్పులు.. అంజి సినిమా విలన్‌ అరెస్ట్‌

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)