Breaking News

అల్లు అర్జున్‌- అట్లీ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ హీరోయన్‌

Published on Mon, 04/28/2025 - 14:22

తెలుగు చిత్రం సీతారామంతో వెలుగులోకి వచ్చిన నటి మృణాల్ ఠాకూర్. అంతకుముందు హిందీ, మరాఠీ తదితర చిత్రాల్లో నటించారు. అయితే సీతారామం చిత్రం ఈమెని తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ను చేసింది. అంతేకాకుండా తమిళం లోను పాపులర్‌ చేసింది. ఆమె నటించిన మరో చిత్రం హాయ్‌ నాన్న. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్‌ చిత్రం నిరాశ పచడంతో క్రేజ్‌ ఒకసారిగా తగ్గిపోయింది. దీంతో అవకాశాలు కూడా మొఖం దాటేసాయి. 

అదేవిధంగా హిందీలో లస్ట్‌ స్టోరీస్‌ చిత్రంలో మెప్పించిన ఈ బ్యూటీ తెలుగులో అడివి శేష్ చిత్రం డెకాయిట్‌లో నటిస్తున్నారు. తాజాగా ప్రభాస్‌కు జతగా స్పిరిట్‌ చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మడికి మరో లక్కీ సాంగ్స్‌ వరించిందని తాజాగా సామాజి మాధ్యమాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప– 2 చిత్రంతో పాన్‌ ఇండియా మార్కెట్‌నే మార్చేశారు. ఆయనకు డైరెక్ట్‌గా కోలీవుడ్‌లొ ఒక చిత్రం చేయాలన్న కోరిక చాలాకాలంగా ఉంది. అలా  లింగు స్వామి దర్శకత్వంలో చిత్రం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. 

అయితే, కారణాలు ఏమైనా ఆ చిత్రం సెట్‌ పైకి వెళ్లలేదు. అలాంటిది తాజాగా అట్లీ దర్శకత్వంలో పాన్‌ ఇండియా చిత్రం చేయడానికి అల్లు అర్జున్‌ సిద్ధమయ్యారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయకలు ఉంటారని సమాచారం. అందుకోసం జాన్వీ కపూర్‌, శ్రద్ధా కపూర్‌, దిశా పటానితో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ లిస్టులో నటి మణాల్‌ ఠాగూర్‌ ముందు వరుసలో చేరినట్లు తెలిసింది. ఈమె ఈ క్రేజీ చిత్రంలో నటించడం దాదాపు ఖరారు అయినట్టు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)