Breaking News

'కోర్ట్‌' మూవీ కలెక్షన్స్‌.. ఫస్ట్‌ డే కంటే మూడో రోజే ఎక్కువ

Published on Mon, 03/17/2025 - 12:55

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్‌’–స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడీ’ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించారు. ఇందులో  శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్‌ తదితరులు కీలకంగా నటించారు. మార్చి 14న హోలీ పండగ సందర్భంగా ఈ చిత్రం విడుదలైంది. రామ్‌ జగదీష్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తొలిరోజే భారీ రెస్పాన్స్‌ రావడంతో  ఎక్కడ చూసిన వీకెండ్‌లో హౌస్‌ఫుల్‌ బోర్డ్స్‌ కనిపించాయి.

కోర్టు సినిమా కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 24.40 కోట్లు రాబట్టింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం రూ.11 కోట్లతో తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే,  మొదటిరోజు రూ. 8.10 కోట్లు, రెండో రోజు రూ. 7.80 కోట్లు, మూడోరోజు రూ. 8.50 కోట్లు కలెక్షన్స్‌ రాబట్టింది. కోర్టు సినిమా ఫస్ట్‌డే నాడు ప్రీమియర్స్‌ షోలతో కలిపి వచ్చిన కలెక్షన్స్‌ కంటే మూడోరోజు ఎక్కువ రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ మధ్య కాలం వచ్చిన సినిమాల్లో కోర్టు చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు.

ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా మరో రెండు కోట్లు ఈ చిత్రానికి వచ్చాయని అంచనా వేస్తున్నారు. కోర్టు సినిమా హీరో నానికి భారీ లాభాలు తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్‌ లాంగ్‌ రన్‌లో రూ. 50 కోట్ల క్లబ్‌లో ఈ చిత్రం చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?