Breaking News

బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సంచలనం.. నాలుగో రోజు ఊహించని కలెక్షన్స్‌!

Published on Tue, 03/18/2025 - 12:35

టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత ఓ చిన్న సినిమా భారీ విజయాన్ని అందుకుంది. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు సైతం రెండు, మూడు రోజులకే ఢీలా పడుతున్నవేళ..ఈ చిన్న చిత్రం మాత్రం రోజు రోజుకి కలెక్షన్స్‌ని పెంచుకుంటూ రికార్డు దిశగా పరుగులు తీస్తోంది. ఆ చిత్రం పేరే ‘కోర్ట్‌’ (Court: State Vs Nobody). నాని (Nani) నిర్మించిన ఈ  మూవీ ఈ నెల 14న విడుదలై తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ని సంపాదించుకుంది. 

ఫలితంగా మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు  సృష్టించింది. పాజిటివ్‌ మౌత్‌టాక్‌తో వీకెండ్‌లో కలెక్షన్స్‌ భారీగా పెరిగాయి. మొత్తంగా రిలీజైన నాలుగు రోజులకే రూ. 28.9 కోట్లను రాబట్టి.. నానికి కాసుల వర్షం కురిపించిదీ చిత్రం.  ఒక్క నాలుగో రోజునే 4.50 కోట్ల గ్రాస్ సాధించిదంటే.. ఈ చిన్న చిత్రం సత్తా ఎంటో అర్థం చేసుకోవచ్చు.  

ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా బాగా వసూళ్లు రాబడుతోంది. ఈ వీకెండ్‌లో ఓవర్సీస్‌ కలెక్షన్స్‌ 1 మిలియన్‌ డాలర్స్‌ దాటే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

కోర్ట్‌ విషయానికొస్తే.. రామ్‌ జగదీశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. శివాజీ కీలక పాత్ర పోషించాడు. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టం గురించి ఈ చిత్రంలో చర్చించారు. కోర్ట్‌రూమ్‌ డ్రామా బాగా పండడం, ఎమోషనల్‌ సన్నివేశాలు హృదయాలను హత్తుకునేలా ఉండడం సినిమాకు విజయాన్ని అందించాయి. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)