Breaking News

జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్‌.. కారణం ఇదే

Published on Thu, 10/03/2024 - 11:36

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ ఇస్తున్నట్లు రంగారెడ్డి కోర్టు తెలిపింది. అయితే, ఈనెల 6 నుంచి 10 వరకు మాత్రమే ఆయనకు ఈ  మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. తన వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువతిపై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదు రావడంతో నార్సింగ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి  ఫిర్యాదుతో జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ను  విధించిన విషయం తెలిసిందే. దీంతో చంచల్‌గూడ జైలుకు ఆయన్ను తరలించారు. అయితే, అక్టోబర్‌ 3 తో  ఆయనకు విధించిన గడువు ముగిసింది. అయితే, జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వాలని  బెయిల్‌ కోసం జానీ మాస్టర్‌ దరఖాస్తు చేసుకున్నారు. దానిని పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్‌ మంజూరు చేసింది. అక్టోబర్‌ 8న ఢిల్లీలో జరిగే జాతీయ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 
 

70వ జాతీయ అవార్డ్స్‌లో జానీ మాస్టర్‌కు చోటు చోటు దక్కిన విషయం తెలిసిందే. తమిళ్‌లో తిరుచిట్రంబళం (తిరు) సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన ఒక పాట నేషనల్‌ అవార్డ్‌ను తెచ్చిపెట్టింది.  ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్‌, సతీష్‌ కృష్ణన్‌ మాస్టర్‌ సంయుక్తంగా ఈ అవార్డ్‌ను అందుకోనున్నారు. 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)