Breaking News

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాపై పిల్‌.. కొట్టివేసిన కోర్టు

Published on Sun, 03/30/2025 - 07:46

ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ( Sankranthiki Vasthunam) సినిమా టికెట్‌ ధరల పెంపు నిర్ణయాన్ని తప్పుపడుతూ దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సినిమా నిర్మాణ వ్యయంపై ఈడీతో దర్యాప్తు చేయించాలని  విజయవాడకు చెందిన  ఎం.లక్ష్మణకుమార్‌ హైకోర్టులో పిల్‌ వేసిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ రవితో కూడిన ధర్మాసనం ఈ పిల్‌పై తీర్పు ఇచ్చింది. ఏదైనా ఒక సినిమా నిర్మాణ కోసం పెట్టిన ఖర్చు విషయంలో దర్యాప్తు చేయమని తాము ఈడీని ఆదేశించలేమని న్యాయస్థానం తెలిపింది. అలా చేస్తే  కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని తెలిపింది. అదంతా అధికార యంత్రాంగం పరిధిలో ఉన్న విషయం అని కోర్టు పేర్కొంది.

సినిమా టికెట్‌ ధరల పెంపు విషయంలో తాము విచారించాల్సింది ఏమీ లేదని కోర్టు పేర్కొంది.  ఆ సినిమాకు సంబంధించిన అదనపు షోల ప్రదర్శన ఇప్పటికే పూర్తయిందని గుర్తుచేసింది. కోర్టులో దాఖలు చేసిన పిల్‌ కేవలం ప్రచారం కోసం మాత్రమే ఉందని పేర్కొంది. భారీ బడ్జెట్‌ సినిమాలకు మాత్రమే ఏపీలో టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వాలని గతంలో ఏపీ ప్రభుత్వం ఒక జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బడ్జెట్‌​ విషయంలో ఈడీతో విచారణ జరిపించాలని పిటిషనర్‌ కోరారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)