'విలన్‌గా నాగార్జున.. అసలు ఎలా ఒప్పించారు': లోకేశ్ సమాధానం ఇదే

Published on Fri, 07/25/2025 - 19:19

కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్‌ ప్రస్తుతం కూలీ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. రజినీకాంత్ హీరోగా వస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో డైరెక్టర్‌ లోకేశ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో నాగార్జునను విలన్‌గా ఎంపిక చేయడంపై ప్రశ్న ఎదురైంది. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్‌ తీసే నాగార్జునను విలన్‌గా ఎలా తీసుకున్నారని లోకేశ్‌ను ప్రశ్నించారు. దీని వెనుక కారణాలను లోకేశ్ వివరించారు. తాను నాగార్జున సార్‌కు వీరాభిమానిని అని లోకేశ్ తెలిపారు. ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తానని అన్నారు. విలన్‌గా ఒప్పించేందుకు చాలా రోజులు పట్టిందని ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు.

లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ..' నేను కాలేజీకి వెళ్లే రోజుల్లోనే నాగార్జున సినిమాలు చూసేవాడిని. ఆయన నటించిన రక్షకుడు మూవీ తన ఫేవరేట్‌. ఆ సినిమాలో నాగ్‌ హెయిర్‌ స్టైల్‌ లుక్‌ తనను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత అదే స్టైల్‌లో కటింగ్ చేయించుకున్నా. శివ మూవీ కూడా చాలాసార్లు చూశా. గీతాంజలి, అన్నమయ్య లాంటి చిత్రాలకు ఫిదా అయిపోయా. కూలీ సినిమా కోసం నాగార్జునను ఒప్పించడం కోసం చాలా కష్టపడ్డాం. ఒకసారి డిఫరెంట్‌గా ట్రై చేయండని అడిగాను. దాదాపు ఏడుసార్లు నాగార్జున వెంటపడ్డాకే నాగ్ సార్ ఒప్పుకున్నారు.' అని తెలిపారు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)