Breaking News

క్యాన్సర్‌తో పోరాటం.. రూ.25 లక్షలు మిస్ చేసుకున్నాడు!

Published on Wed, 09/11/2024 - 12:04

ఇటీవల కల్కి మూవీతో ప్రేక్షకులను అలరించిన బిగ్‌బీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ ప్రస్తుతం కౌన్‌ బనేగా కరోడ్‌పతి సీజన్‌ -16కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న  అక్షయ్ నారంగ్ అనే యువకుడికి రూ.25 లక్షల ప్రశ్న ఎదురైంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పటికీ ఊహించని విధంగా షో నుంచి తప్పుకున్నాడు. దీంతో కేవలం రూ.12.5 లక్షలు మాత్రమే సొంతం చేసుకున్నాడు. అతను అనుకున్న ఆన్సర్‌పై కాన్ఫిడెన్స్‌ లేకపోవడంతో షో నుంచి నిష్క్రమించాడు. అయితే ఢిల్లీకి చెందిన యువకుడు తన నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.

(ఇది చదవండి: బాలీవుడ్‌ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య)

అయితే అక్షయ్ నారంగ్ గతంలో క్యాన్సర్‌తో పోరాడినట్లు ఈ షోలో పంచుకున్నారు. 2018లో తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించాడు. ఆ తర్వాత ఓ కణితిని వైద్యులు తొలగించారని తెలిపాడు. దాదాపు రెండేళ్లపాటు క్యాన్సర్‌తో పోరాటం చేసినట్లు చెప్పుకొచ్చాడు. కాలేజీలో తన స్నేహితులు సరదాగా గడుపుతున్న సమయంలో తాను ఆసుపత్రిలో ఉన్నానని అక్షయ్ తన బాధను అమితాబ్‌తో పంచుకున్నారు. నేను ఆరోగ్యంగా బయటకు వచ్చి కౌన్‌ బనేగా కరోడ్‌పతి షో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని అమితాబ్‌తో అన్నారు. దీంతో అమితాబ్ అతనికి ధైర్యం చెప్పారు.

 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)