Breaking News

నల్లగొండ గద్దర్‌ నోట ‘కానిస్టేబుల్‌’ పాట

Published on Sat, 01/25/2025 - 19:10

వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కానిస్టేబుల్‌’. వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి నటిస్తోంది.  ఆర్యన్ సుభాన్ ఎస్.కె.  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్‌ సాంగ్‌ విడుదలైంది. 

"కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న...కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా" అంటూ సాగే టైటిల్  సాంగ్ ను హైదరాబాద్  పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్  చేతుల మీదగా విడుదల చేశారు. ఈ పాటకు  శ్రీనివాస్ తేజ సాహిత్యాన్ని అందించగా  సుభాష్ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చారు. నల్గగొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.

ఈ సందర్భంగా  పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, నేను ఆవిష్కరించిన ఈ టైటిల్ సాంగ్ చాలా బావుంది. మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం.  వాళ్ళ మీద ఈ సాంగ్ రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.  ప్రతీ  పోలీస్ ఈ సాంగ్ వింటారు" అని అన్నారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "సి వి ఆనంద్ గారు ఈ పాట విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు మంచి కం బ్యాక్ సినిమా అవుతుంది. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించాను" అని  అన్నారు.

నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, "కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల అది నెరవేరకపోవడంతో ఆ  టైటిల్ తో ఈ  సినిమాను నిర్మించడం జరిగింది.  కానిస్టేబుల్ ల మీద నాకున్న గౌరవంతో ఒక అద్భుతమైన పాటను నేను దగ్గరుండి రాయించి,  నల్గొండ గద్దర్ నరసన్న తో పాటించడం జరిగింది. ఈ పాటను హైదరాబాద్ పోలీస్  కమిషనర్ సివి ఆనంద్ గారు విడుదల  చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. .

దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, మంచి కథ, కథనాలు, పాత్రలో వరుణ్ ఒదిగిపోయిన విధానం, నిర్మాత అభిరుచి ఈ చిత్రం అద్భుతంగా రావడానికి దోహదం చేసిందని అన్నారు. సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ ఎంతగానో స్పందింప జేస్తుందని అన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)