Breaking News

అందుకే జబర్దస్త్‌ నుంచి బయటకు వచ్చా: ‘బలగం’ డైరెక్టర్‌ వేణు

Published on Fri, 03/10/2023 - 13:40

కమెడియన్‌ వేణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బలగం చిత్రంతో దర్శకుడిగా మారిన వేణు ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌తో పాపులర్‌ అయ్యాడు. అంతకు ముందే సినిమాల్లో కమెడియన్‌గా నటించిన వేణుకు జబర్దస్త్‌ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. వేణు వండర్స్ అనే పేరుతో టీంకు లీడర్‌గా వ్యవహరించిన నవ్వులు పండించాడు. ఇప్పుడున్న గెటప్‌ శ్రీను, సుడిగాలి సుదీర్‌ ఆయన టీంలోనే ఎదిగారు. ఈ కామెడీ షోలో ఎన్నో హిట్‌ టాస్క్‌ చేసి బుల్లితెర ప్రేక్షకులను కడుబ్బా నవ్వించిన వేణు జబర్దస్త్‌లో ఎక్కువ కాలం ఉండలేకపోయాడు.

చదవండి: Naresh-Pavithra Marriage: పెళ్లి చేసుకున్న నరేశ్‌-పవిత్ర?

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వేణు ఈ షో నుంచి బయటకు వచ్చాడు. అయితే విభేదాల కారణంగానే వేణు ఈ షో నుంచి బయటకు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో తాను జబర్దస్త్‌ నుంచి బయటకు రావడంపై తాజాగా వేణు స్పందించాడు. ఆయన దర్శకత్వం వహించిన ‘బలగం’ మూవీ మంచి విజయం సాధించిన సందర్భంగా వేణు వరుస ఇంటర్య్వూల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు జబర్దస్త్‌ వీడటంపై ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందిస్తూ..  ‘విబేధాల కారణంగా నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను అనడంలో వాస్తవం లేదు. 

చదవండి: ఆ ఘనత విజయకాంత్‌దే: హీరో విశాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కేవలం సినిమాపై ఇష్టంతోనే ఆ షో వదిలేశాను. మొదటి నుండి నా లక్ష్యం సినిమానే. ఫుల్ టైం సినిమాల్లో రాణించాలనే కోరికతోనే జబర్దస్త్‌ వీడాను. నేను ఉన్నప్పుడు రేటింగ్ బాగుంది. మంచి రెమ్యూనరేషన్ వస్తుంది. అయినప్పటికీ సినిమా కోసం వదులుకొని బయటకు వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అప్పట్లో వేణు చేసిన ఓ స్కిట్‌ వివాదంలో నిలిచన సంగతి తెలిసిందే. ఓ వర్గం వారు వేణుపై దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. బలగం చిత్రంతో తొలిసారి మెగాఫోన్‌ పట్టిన వేణు మొదటి ప్రయత్నంలోనే విజయం అందుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం అందరి ఊహాలను తలకిందులు చేస్తూ మంచి విజయం సాధించింది. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు