Breaking News

ప్రముఖ కమెడియన్‌కు బ్రెయిన్‌ స్ట్రోక్‌

Published on Sat, 01/11/2025 - 16:55

ప్రముఖ కమెడియన్‌ టీకు తల్సానియా (Tiku Talsania)కు బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యారు. దిల్‌ హై కీ మంతా నహీ (1991), కబీ హా కబీ నా (1993), ఇష్క్‌ (1997) చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు శుక్రవారం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యారు. ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

గుండెపోటు కాదు!
మొదటగా టీకూకు గుండెపోటు వచ్చిందని రూమర్లు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని, తనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిందని నటుడి భార్య దీప్తి తల్సానియా పేర్కొంది. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఓ సినిమా స్క్రీనింగ్‌కు వెళ్లాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించాం అని దీప్తి తెలిపింది.

ఎవరీ టీకు?
టీకు తల్సానియా.. ప్యార్‌ కె దో పాల్‌ (1986) సినిమాతో బాలీవుడ్‌లో నట ప్రస్థానం ప్రారంభించారు. కమెడియన్‌గా దిల్‌ హై కే మంతా నహీ, ఉమర్‌ 55కీ దిల్‌ బచ్‌పన్‌, బోల్‌ రాధా బోల్‌, అండాజ్‌ ఆప్న ఆప్న, మిస్టర్‌ బెహరా వంటి చిత్రాల్లో నటించాడు. తర్వాత కామెడీకి కాస్త బ్రేక్‌ ఇచ్చి వక్త్‌ హమారా హై మూవీలో సీరియస్‌ లుక్‌లో మెప్పించాడు. దేవదాస్‌ మూవీతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

కూతురు కూడా నటిగా..
వీర్‌, కూలీ నెం.1, రాజా హిందుస్తానీ, రాజు చాచా, హంగామా, బడే మియా చోటే మియా, జుడ్వా.. ఇలా ఎన్నో చిత్రాలు చేశారు. చివరగా విక్కీ విద్యాకా వో వాలా వీడియో సినిమాలో కనిపించారు. టీకు కూతురు శిఖ తల్సానియా కూడా నటిగా రాణిస్తోంది. సత్యప్రేమ్‌ కీ కథ, వీరే దీ వెడ్డింగ్‌ వంటి చిత్రాల్లో నటించింది.

చదవండి: చికెన్‌గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..!

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)