Breaking News

అందాల రాముడు చేయనని చెప్పాను: సునీల్‌

Published on Fri, 02/10/2023 - 12:22

కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ మెప్పించాడు సునీల్‌. అయితే హీరో పాత్రలోనూ కామెడీ చొప్పించి నవ్వించగల ఘనుడు సునీల్‌. మర్యాద రామన్న సినిమాలో ఆయన పాత్ర, నటన, కామెడీ అద్భుతంగా పండాయి. 'విలన్‌ అవుదామని వచ్చి కమెడియన్‌ అయ్యాను. చాలారకాల పాత్రలు చేసేశానని నాకు పుష్పలో కొత్త గెటప్‌ వేశారు. నాపైన కోట శ్రీనివాసరావు ప్రభావం గట్టిగా ఉంది. అప్పుడే సీరియస్‌గా చెప్పి వెంటనే నవ్వించగలడు. ఆ చెప్పే విధానం బాగుంటుంది. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి కూడా నాకు ఇన్‌స్పిరేషన్‌.

అందాల రాముడు సినిమా చేయనని చెప్పా. రెండేళ్లపాటు అదే మాట చెప్పుకుంటూ వచ్చా. కానీ నేనే ఆ సినిమా చేయాలని డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ పట్టు పట్టడంతో చేశాను. మర్యాద రామన్న అనేది భగవంతుడు ఇచ్చిన వరం. పూలరంగడు కోసం బాగా కష్టపడి సిక్స్‌ ప్యాక్‌ చేశాను. నేను ఏ క్యారెక్టర్‌కైనా రెడీగా ఉన్నాను. ఏ పాత్ర వచ్చినా చేస్తాను. తెలుగులో రామ్‌చరణ్‌- శంకర్‌ మూవీ, పుష్ప 2, విరూపాక్ష సహా మరో రెండు చిత్రాలు చేస్తున్నాను. అలాగే తమిళ్‌లో మహావీరన్‌, జైలర్‌, మార్క్‌ ఆంటోని, జపాన్‌ చేస్తున్నా. హిందీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ డేట్స్‌ కుదరక కొన్నింటికి న్యాయం చేయలేకపోతున్నా' అని చెప్పుకొచ్చాడు సునీల్‌. తన కుటుంబం గురించి చెప్తూ.. తన భార్య పేరు శృతి అని కావ్య, దుశ్యంత్‌ అని ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు. తల్లితో కలిసి అంతా ఒకేచోట ఉంటామని పేర్కొన్నాడు.

చదవండి: చీటింగ్‌ ఆరోపణలపై స్పందించిన సింగర్‌ యశస్వి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)