Breaking News

సుడిగాలి సుధీర్‌ సరసన దివ్యభారతి.. కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌

Published on Sat, 05/20/2023 - 07:09

సుడిగాలి సుధీర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘జీ.ఓ.ఏ.టీ’ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘పాగల్‌’ ఫేమ్‌ నరేష్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్‌. లక్కీ మీడియా–మహారాజా క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు.

కాగా శుక్రవారం (మే 19) సుధీర్‌ బర్త్‌డేని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ– ‘‘మంచి కథాంశంతో తెరకెక్కుతున్న మా సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. చదవండి: ఆ డైలాగ్స్ వింటే చాలు.. పూనకాలు పుట్టుకొచ్చేస్తాయి! 

ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘జీ.ఓ.ఏ.టీ’ లాంటి మంచి కాన్సెప్ట్‌ ఉన్న కథతో సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు నరేష్‌ కుప్పిలి. ఈ చిత్రానికి సంగీతం: లియోన్‌ జేమ్స్, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)