Breaking News

ఒక్క టికెట్‌ రూ.25 వేలా? డబ్బు వెనక పరిగెడతాడనుకోలేదు!

Published on Fri, 09/13/2024 - 17:24

ప్రముఖ సింగర్‌, నటుడు దిల్జిత్‌ దోసాంజ్‌ త్వరలో ఇండియాలోని పలు మెట్రో నగరాల్లో సంగీత కచేరి నిర్వహించనున్నాడు. 'దిల్‌ లుమినటి టూర్‌' పేరిట నిర్వహించబోతున్న ఈ కన్సర్ట్‌కు సంబంధించి లక్ష టికెట్లను సెప్టెంబర్‌ 10న అమ్మకానికి పెట్టగా కొద్ది నిమిషాల్లోనే హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే ఆ టికెట్‌ రేట్లు మధ్య తరగతి జనాలకు అందుబాటులో లేవని కమెడియన్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ సౌమ్య సాహ్ని ఫైర్‌ అయింది.

అంత డబ్బు ఎక్కడిది?
సంగీత కచేరిలో ఒక్క టికెట్‌ రూ.20-25 వేలా? ప్రేక్షకుల దగ్గర అంత డబ్బు ఎక్కడిది? పైగా ఎక్కువమంది నిరుద్యోగులే! మన భాషలో ఒకరు అద్భుతంగా పాడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు.. కానీ టికెట్‌ రేట్లు ఆ రేంజ్‌లో ఉంటే దాన్ని కొనడం మధ్య తరగతి వాళ్లకు ఎలా సాధ్యమవుతుంది? పైగా పిల్లలతో కలిసే కుటుంబాలు కచేరీకి వెళ్తుంటాయి.

బాగానే సంపాదిస్తున్నారు కదా!
ఎలాగో విదేశాల్లో కచేరీలు పెట్టి బాగానే సంపాదిస్తున్నారు కదా! అలాంటప్పుడు కనీసం మనవాళ్ల దగ్గరైనా తక్కువ వసూలు చేయొచ్చుగా.. అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా ఒక్క టికెట్‌ దాదాపు రూ.10 వేలకే అమ్ముతారు. అలాంటిది నువ్వు రూ. 15 వేలు, రూ.20-25 వేలకు టికెట్స్‌ అమ్మడమేంటో నీకే తెలియాలి' అని వీడియోలో మండిపడింది.

రూ.500 పెట్టడమే ఎక్కువ
ఈ వీడియో చూసిన నెటిజన్లు సౌమ్య అభిప్రాయానికే మద్దతిస్తున్నారు. 'ఒక్క టికెట్‌కు రూ.500 పెట్టడమే ఎక్కువ. నేనైతే ఆ కచేరీని యూట్యూబ్‌లో చూస్తాను', 'మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయ్యుండి దిల్జిత్‌ ఇలా డబ్బు, పేరు వెనక పరిగెడతాడని అస్సలు ఊహించలేదు', 'అతడు కావాలనుకుంటే ఒక్క సిటీలోనే పలు షోలు చేయొచ్చు, కానీ అభిమానుల కంటే కూడా డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చాడు' అని కామెంట్లు చేస్తున్నారు. 

ఆరోజే కచేరీ ప్రారంభం
కాగా దిల్జిత్‌ కచేరీ అక్టోబర్‌ 26 ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, లక్నో, పుణె, కోల్‌కతా, బెంగళూరు, ఇండోర్‌, చంఢీగర్‌ వంటి నగరాల మీదుగా ఈ కచేరీ టూర్‌ సాగనుంది.

 

 

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)