Breaking News

బుల్లితెర కమెడియన్‌ ఇంట తీవ్ర విషాదం

Published on Wed, 08/17/2022 - 16:41

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ల చిరునవ్వు వెనక కొండం విషాదం ఉంటుంది. కానీ ఆ బాధలను, దుఃఖాలను దిగమింగుకుని మోముపై బలవంతపు నవ్వును పులుముకొంటారు. కడుపులోనే కష్టాన్ని దాచుకుని కడుపుబ్బా నవ్విస్తారు. ముళ్లదారిలో నడిచిన కమెడియన్ల జాబితాలో పటాస్‌ ప్రవీణ్‌ ఒకరు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్‌ సహా పలు కామెడీ షోలలో కమెడియన్‌గా రాణిస్తున్న అతడి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజాగా ప్రవీణ్‌ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు.

గత కొంతకాలంగా బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయనను ఇటీవల ఆస్పత్రిలో చేర్పించగా వెన్నుపూసలో నీరు వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ఆ నీరు తీయడానికి ప్రయత్నించే క్రమంలో అతడి కాళ్లుచేతులు పడిపోయాయి. దీంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తిందని, ప్రస్తుతం ఆయన చివరి స్టేజీలో ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడంతో ప్రవీణ్‌ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

కాగా ప్రవీణ్‌ తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి రెండో పెళ్లి చేసుకోకుండా ప్రవీణ్‌ను, అతడి అన్నను చదివించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి వారిని మంచి స్థాయిలో నిలబెట్టారు. కన్నకొడుకుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

చదవండి: రాకెట్రీ కోసం ఇల్లు అమ్మేసిన హీరో, మాధవన్‌ ఏమన్నాడంటే?
రౌడీ హీరో ఇంట పూజలు, హీరోహీరోయిన్లకు తాయత్తులు!

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)