Breaking News

డాక్టర్‌ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..

Published on Mon, 05/13/2024 - 19:04

జబర్దస్త్‌ కమెడియన్‌ ముక్కు అవినాష్‌ బుల్లితెరపై ప్రసారమయ్యే షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. జగిత్యాల జిల్లాలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన ఈ కమెడియన్‌ అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. 2021లో అనూజతో పెళ్లి జరగ్గా గతేడాది ఆమె ప్రెగ్నెన్సీ వార్తను వెల్లడించాడు. కానీ ఈ ఏడాది ప్రారంభంలో అబార్షన్‌ అయిందని బ్యాడ్‌ న్యూస్‌ చెప్పాడు.

ఐదు నెలల క్రితమే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవినాష్‌ మాట్లాడుతూ.. నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. 2021లో అనూజతో నా పెళ్లి జరిగింది. గతేడాది తను గర్భవతి. ఐదు నెలల క్రితమే బిడ్డను కోల్పోయాం. తెల్లవారితే డెలివరీ అనగా సడన్‌గా అనూజ కడుపులో బేబీ కదలికలు ఆగిపోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్తే బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. ఉమ్మునీరు మింగడం వల్ల అలా జరిగి ఉండొచ్చన్నారు.

అర్ధరాత్రి రోడ్డుపై..
అప్పుడు నేను స్టేజీపై షూటింగ్‌లో ఉన్నాను. వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఏదో ఒకటి చేయండని డాక్టర్‌ కాళ్ల మీద పడ్డాను. హార్ట్‌బీట్‌ ఆగిపోతే ఏం చేయలేమన్నారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఎటు వెళ్తున్నానో కూడా తెలీకుండా రోడ్డుపై ఏడ్చుకుంటూ ఒంటరిగా సాగిపోయాను. ఆ శిశువును బయటకు తీస్తే అచ్చం నాలాగే ఉన్నాడు. 2.75 కిలోల బరువుతో పుట్టాడు. కానీ వాడిలో ప్రాణం లేదు. ఇప్పటికీ నా భార్య అర్ధరాత్రిళ్లు కుమిలి కుమిలి ఏడుస్తోంది. తొమ్మిది నెలలు మోసింది కదా.. ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతోంది' అని అవినాష్‌ ఎమోషనలయ్యాడు.

చదవండి: Satish Joshi: స్టేజీపై కుప్పకూలి తుదిశ్వాస విడిచిన నటుడు

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)