Breaking News

కమెడియన్‌ ధనరాజ్‌తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య

Published on Thu, 03/27/2025 - 19:57

టాలీవుడ్‌లో కమెడియన్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు ధనరాజ్‌ (Dhanraj). బుల్లితెర నుంచి వెండితెరకు సాగిన అతడి ప్రయాణంలో భార్య శిరీష వెన్నంటే నిలబడిందని ఎన్నోసార్లు ఎమోషనలయ్యాడు. తాజాగా శిరీష తొలిసారి ఓ ఇంటర్వ్యూకు హాజరై ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. శిరీష (Dhanraj Wife Sirisha) మాట్లాడుతూ.. ధనరాజ్‌ది విజయవాడ. నాది ఖమ్మం. నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ను. ధనరాజ్‌ ఫిలిం నగర్‌లో ఓ డ్యాన్స్‌ స్టూడియో పెట్టినప్పుడు టీచర్‌ కోసం వెతుకుతున్నారు. అలా నన్ను కలిశాడు. 

క్యాన్సర్‌తో కన్నుమూసిన ధనరాజ్‌ తల్లి
అదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ నేను పరిచయమైన రోజే అతడి అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. ఆమె వెళ్లిపోతూ నన్ను అతడికి ఇచ్చిందని ధనరాజ్‌ ఫీలయ్యాడు. తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బు లేకపోతే నా దగ్గరున్న బంగారం ఇచ్చేశాను. నవంబర్‌లో ఆమె చనిపోతే మార్చిలో మా పెళ్లి జరిగింది. మాది ప్రేమ వివాహం. అది కూడా నేనే ప్లాన్‌ చేశాను. రేపు మన పెళ్లి అనగానే సరేనని తలూపాడు. ఇంట్లో వాళ్లను కాదని 15 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. 

మా పెళ్లయ్యాకే అతడికి పేరొచ్చింది
మా పెళ్లయిన మూడో రోజే జగడం సినిమా రిలీజైంది. అక్కడి నుంచి ధనరాజ్‌కు అవకాశాలు, ఫేమ్‌ మొదలైంది. అయితే ఆయన నిర్మాతగా ధనలక్ష్మి తలుపు తడితే అని ఓ సినిమా తీశాడు. అది నాకిష్టం లేదు. ఆయన మాత్రం కచ్చితంగా ఆడుతుందని నమ్మి తీశాడు. ఒకవేళ సినిమా పోతే జీరో నుంచి మొదలుపెట్టాల్సిందే! నేను అనుకున్నట్లుగానే జీరో నుంచి మళ్లీ స్టార్ట్‌ చేశాం.. సోషల్‌ మీడియాలో మా గురించి ఏవేవో పుకార్లు రాస్తుంటారు. 

పదిరోజులు మాట్లాడుకోం
ఆ మధ్య మేము రోడ్డున పడ్డామని రాశారు. ఇల్లు కూడా అమ్మేశామని ప్రచారం చేశారు. ఇప్పుడేమో విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు! మా మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి. వారం, పది రోజులపాటు మాట్లాడుకోం. అంతేకానీ విడాకులు తీసుకునేంత సీన్‌ ఏం లేదు. మేము సంతోషంగా ఉన్నాం. ఏవి పడితే అవి రాయొద్దు. ఇకపోతే ధనరాజ్‌ ఫ్రెండ్స్‌ మా ఇంటికి వస్తూ ఉంటారు. సుడిగాలి సుధీర్‌ నాకు ఎక్కువ క్లోజ్‌. ప్రస్తుతానికైతే వాడు పెళ్లే చేసుకోను అంటున్నాడు. మరి ఏం చేస్తాడో చూడాలి! అని శిరీష చెప్పుకొచ్చింది.

చదవండి: ఆలియాను చూసి ఈర్ష్య పడ్డా.. ఈమెకేంటి.. లైఫ్‌ సెట్టు అనుకున్నా!

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు