Breaking News

Chalaki Chanti: ఇంకా ఐసీయూలోనే చలాకీ చంటి

Published on Mon, 04/24/2023 - 09:19

కమెడియన్‌, నటుడు చలాకీ చంటి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే! ఈ నెల 21న చంటికి తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు గుండెపోటుగా గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు.

రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు తేలడంతో డాక్టర్లు స్టంట్‌ వేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. చంటి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇంతవరకు ఎక్కడా స్పందించనేలేదు.

కాగా జబర్దస్త్‌ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు చలాకీ చంటి. తనదైన కామెడీ టైమింగ్‌తో, కడుపుబ్బా నవ్వించే స్కిట్లతో ప్రేక్షకులను అలరించాడు. బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లోనూ పాల్గొన్న అతడు సినిమాల్లోనూ నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు. కొంతకాలంగా మాత్రం అతడు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కనిపించడం లేదు.

చదవండి: విరూపాక్ష సినిమా వేయలేదని థియేటర్‌పై తేజ్‌ ఫ్యాన్స్‌ దాడి

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)