Breaking News

అమ్మవారి సినిమా.. క్లాప్‌ కొట్టిన కమెడియన్‌ అలీ

Published on Mon, 06/09/2025 - 15:28

నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్.బి.జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా 'చండీ దుర్గమా'. జయశ్రీ వెల్ది నిర్మాతగా, ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో సోమవారం (జూన్‌ 9న) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. చిట్టి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, రఘు కారుమంచి ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. 

కమెడియన్ అలీ మాట్లాడుతూ.. అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. డైరెక్టర్ మైను ఖాన్. ఎండీ. మాట్లాడుతూ.. ఈ రోజు మా చండీ దుర్గమా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన అలీ గారికి థాంక్స్‌. రఘు కారుమంచి, చిట్టి కూడా మాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఈ మధ్య అమ్మవారి నేపథ్యంగా సినిమాలు రూపొందడం లేదు. 

సౌందర్య గారి అమ్మోరు, విజయశాంతి గారి చండీ సినిమా తర్వాత అమ్మవారి కథతో సినిమా రాలేదు. ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా, ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా డార్క్ థీమ్‌లో సరికొత్త కాన్సెప్ట్ తో చండీ దుర్గమా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రస్తుతం థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్‌కు ఆడియన్స్‌ను రప్పించేలా చండీ దుర్గమా సినిమా మేకింగ్‌ను డిజైన్ చేస్తున్నాం అన్నారు. నిర్మాత జయశ్రీ వెల్ది మాట్లాడుతూ.. తెలుగు ఆడియన్స్ అమ్మవారి నేపథ్యంగా వచ్చిన చిత్రాలను ఎంతో ఆదరించారు. మా సినిమాకు కూడా అలాంటి సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)