Breaking News

అమరన్‌ టీమ్‌ రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలి: విద్యార్థి

Published on Thu, 11/21/2024 - 18:20

తమిళ హీరో శివకార్తికేయన్‌ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ అమరన్‌. మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో రన్‌ అవుతోంది. 

ఇకపోతే ఈ సినిమా వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ విఘ్నేశన్‌ అనే విద్యార్థి చిత్రబృందానికి లీగల్‌ నోటీసులు పంపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్లు చేసి విసిగిస్తుండటంతో మానసిక వేదనకు లోనవుతున్నానన్నాడు.

అసలేం జరిగిందంటే?
అమరన్‌ సినిమాలోని ఓ సీన్‌లో సాయిపల్లవి హీరోకు తన ఫోన్‌ నెంబర్‌ ఇస్తుంది. అది నిజంగానే సాయిపల్లవి నెంబర్‌ అని భావించిన ఫ్యాన్స్‌ ఫోన్‌ కాల్స్‌ చేయడం మొదలుపెట్టాడు. సినిమాలో చూపించిన నెంబర్‌ తనదేనని విఘ్నేశన్‌ అనే ఇంజనీర్‌ విద్యార్థి తెలిపాడు.

ఇది సాయిపల్లవి నెంబర్‌ అనుకుని ఆమె అభిమానులు పెద్ద ఎత్తున కాల్స్‌ చేస్తున్నారని వాపోయాడు. వరుస ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌ల వల్ల తనకు ప్రశాంతత లేకుండా పోయిందన్నాడు. తన ఫోన్‌ నెంబర్‌ ఉపయోగించినందుకుగానూ అమరన్‌ టీమ్‌ రూ.1.1 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. మరి ఈ గొడవపై చిత్రయూనిట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)