వేశ్యతో కిరాయి హంతకుడి ప్రేమాయణం.. కాక్రోచ్‌ సెన్సార్‌ పూర్తి

Published on Sat, 02/07/2026 - 19:24

అవార్డు విన్నర్ దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన బలమైన సామాజిక థీమ్‌తో కూడిన చిత్రం ‘కాక్రోచ్’. తాజాగా ఈ మూవీ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై బి. బాపిరాజు, ముతుకి నాగ సత్యనారాయణలు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ (A) సర్టిఫికెట్ మంజూరు చేసింది.

‘సమాజంలోని చీకటి మూలలను, అవినీతి, భ్రష్టుత్వాన్ని కఠినంగా చిత్రీకరించిన ఈ చిత్రం... అడ్డురోడ్లపై జీవనం సాగించే వేశ్యకు, ఒక కిరాయి హంతకుడికి మధ్య ఏర్పడిన స్వచ్ఛమైన ప్రేమ, స్నేహాన్ని చూపిస్తుంది. సమాజం చీత్కరించే మురికి మనుషుల మధ్య సాగే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ద్వంద్వ విలువలు, విలువల ద్వంద్వత్వాన్ని ప్రశ్నిస్తూ... కాక్రోచ్‌ను చంపితే చప్పట్లు కొడుతూ, సీతాకోక చిలుకలపై కవితలు రాసే సమాజ మనస్తత్వాన్ని ఈ చిత్రం ఎండగట్టనుంది’ అని దర్శకుడు తెలిపారు. 

సున్నిత మనస్కులు మరియు పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండాలని దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బి. బాపిరాజు పత్రికా ప్రకటన ద్వారా  కోరారు. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ , మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేష్, మల్లిక, ఎఫ్‌ఎమ్ బాబాయ్, రాజు, బాలాజీ, ఎల్‌బీ రమణ, ఆర్‌కే సింగ్, పూజా, పొట్టి మూర్తి, ప్రసాద్, రేలారే రఘు బృందం, జానీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి మొదటి వారంలో విడుదల కానుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)